కిచెన్ టిప్స్ : ఆలుగడ్డలు, కీరదోసలను ఫ్రిజ్ లో పెట్టకూడదా..!

కిచెన్ టిప్స్ : ఆలుగడ్డలు, కీరదోసలను ఫ్రిజ్ లో పెట్టకూడదా..!

వారం, పదిరోజులకి సరిపడా పండ్లు, కూరగాయలు తెచ్చి ఫ్రిజ్ లో పెడుతుంటాం. రాత్రిళ్లు మిగిలిపోయిన ఫుడ్ ని కూడా ఫ్రిజ్లోనే పెడతాం. ఆ ఆలోచన మంచిదే అయినా.. అన్ని రకాల ఫుడ్స్ ఫ్రిజ్ టెంపరేచర్ కి సూట్ కావు. 

అలాంటి కొన్ని పదార్థాలు ఇవి.. 

*కీరదోసని ఫ్రిజ్ లో పెడితే వాటి టేస్ట్ పూర్తిగా మారుతుంది. చప్పబడతాయి అవి. పైగా ఫ్రిజ్లో పెట్టడం వల్ల కీరదోస మెత్తబడుతుంది.

*ఫ్రైడ్ ఫుడ్స్ ని ఫ్రిజ్ లో పెట్టకూడదు. ఎందుకంటే వాటిని తిరిగి వేడిచేస్తే ఫ్రెష్ గా ఉండవు. అలాగే ఉడికించిన పాస్తాని ఫ్రిజ్ స్టోర్ చేయకూడదు. 

*టొమాటో సాస్ లేదా పేస్ట్ ని ఫ్రిజ్ లో పెడితే వాటిల్లోని నీరంతా పోతుంది. టెక్చర్ కూడా
  ఇంతకుముందులా ఉండదు.

*ఆలుగడ్డల్ ని ఫ్రిజ్ లో పెడితే, వాటిల్లోని పిండి పదార్ధమంతా చక్కెరగా మారుతుంది. వండేటప్పుడు ఆ చక్కెర అమైనో యాసిడ్స్ తో కలిసి ఆరోగ్యాన్ని చిక్కుల్లో     పడేస్తుంది.

*అరటిపండ్లని ఫ్రిజ్ లో పెడితే నల్లబడతాయి. అలాగే బ్రెడ్ ని కూడా ఫ్రిజ్ లో పెట్టకూడదు.

*కాఫీ బీన్స్ ని కూడా ఫ్రిజ్ లో పెట్టకూడదు. వీటివల్ల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా.. ఇవి ఫ్రిజ్ లోని మిగతా పదార్థాల టేస్ట్ ని అబ్జార్బ్ చేసి, కాఫీ టేస్ట్ ని మారుస్తాయి.