అలోక్ శర్మకు నైట్‌‌హుడ్ అవార్డు

అలోక్ శర్మకు నైట్‌‌హుడ్ అవార్డు

లండన్: భారత సంతతికి చెందిన బ్రిటన్ మాజీ మంత్రి అలోక్ శర్మ  నైట్‌‌హుడ్ అవార్డుకు ఎంపికయ్యారు. న్యూ ఇయర్ సందర్భంగా ఆదివారం ఆయన బ్రిట‌‌న్ కింగ్ చార్లెస్ 3 చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. ఈ ఏడాది బ్రిట‌‌న్‌‌లో జ‌‌రిగిన కాప్ 26 స‌‌ద‌‌స్సుకు అధ్యక్షత వహించిన అలోక్.. వాతావరణ సమస్యలను పరిష్కరించి ప‌‌ర్యావర‌‌ణాన్ని కాపడటం కోసం ప్రపంచ దేశాలు, బ్రిట‌‌న్ మధ్య ఓ ఒప్పందం కుదిరించడంలో కీల‌‌కంగా వ్యవహరించారు. ప్రజా సేవలో విశిష్ట కృషి చేసిన1,107 మందిని కొత్త ఏడాదిలో బ్రిట‌‌న్ రాజు నైట్‌‌హుడ్ అవార్డుతో గౌర‌‌వించ‌‌నున్నారు. ఈ లిస్ట్ లో ఉన్న విదేశాల‌‌కు చెందిన 30 మందిలో అలోక్ ఒక‌‌రుకాగా.. ఆయన ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో జన్మించారు.