ITR Filing: టాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే..

ITR Filing: టాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే..

ITR 2025: జూన్ నెల వచ్చేసింది. దీంతో ప్రస్తుతం చాలా మంది టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయటం కోసం సన్నాహాలు చేసుకుంటున్నారు. ఉద్యోగులు, వ్యాపారులు తమ రిటర్న్ దాఖలు చేసే సమయంలో తెలియకు కొన్ని తప్పులు చేస్తుంటారు. అయితే అవి వారికి చట్టపరమైన చిక్కులను తెచ్చిపెట్టే అవకాశం ఉన్నందున ముందుగానే కొన్ని జాగ్రత్తలు పాటించటం ఉత్తమం.

ఎవరైనా వ్యక్తులు తమ పన్ను రిటర్న్ దాఖలు చేస్తున్నట్లయితే దానిని నింపేటప్పుడు తప్పులు లేకుండా ఖచ్చితమైన సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. మీరు అందించిన వివరాలు సంబంధిత పత్రాలతో సరిపోల్చినప్పుడు సరిపోకపోతే ఆదాయపు పన్ను అధికారుల నుంచి నోటీసులు వచ్చే ప్రమాదం ఉంటుంది. పన్ను అధికారులు సైతం ఫారమ్ ఫిల్ చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు వివరాలు సరిచూసుకోవాలని సూచిస్తున్నారు. 

ఈ క్రమంలో ఇప్పటికే ఏదైనా చెల్లించాల్సిన బకాయిలు ఉన్నట్లయితే మెుదటగా వాటిని పన్ను శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఏదైనా సెక్షన్ల కింద వాపసుల కోసం క్లెయిమ్ చేస్తున్నట్లయితే ఖచ్చితందా దానికి సంబంధించిన వివరాలను మారిన పన్ను చట్టాల కింద తప్పనిసరిగా అందించాల్సి ఉంటుందని గమనించండి. మీరు అందించిన వివరాలను ఏఐ సాంకేతికల ద్వారా అసలైనవా నకిలీవా అనే వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుందని మర్చిపోకండి. ఈ క్రమంలో ఏదైనా తేడా వస్తే పన్ను అధికారులు దానికి సంబంధించిన ఒరిజినల్ పత్రాలను అడిగే అవకాశం ఉంది. 

రిటర్న్ ఫైలింగ్ సమయంలో పాత పన్ను విధానం కింద కొనసాగే వ్యక్తులు తమ రుణాలు, ఇన్సూరెన్స్ పాలసీలు, పెట్టుబడులకు సంబంధించిన వివరాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు ఉన్న అన్ని బ్యాంక్ వివరాలను సైతం అందులో పొందుపరచాల్సి ఉంటుంది. వార్షిక సమాచార ప్రకటన (AIS)లో ఏదైనా ఖాతా కనిపించకపోతే, దాని వివరాలను కూడా ఇవ్వాలి. సాధారణంగా వేతనజీవులు ఫారమ్-1 ఫిల్ చేస్తుంటారు. అలాగే ఫారమ్ 26ఏఎస్ వివరాలను తనిఖీ చేసి అందించాలని గుర్తుంచుకోండి.

రిటర్న్ ఫైలింగ్ తర్వాత పన్ను శాఖ పరిశీలన సమయంలో ఏదైనా అదనపు సమాచారం అవసరమైనా లేదా ఏదైనా మెుత్తం గురించి క్లారికీ కావాలన్నా అందుకోసం పన్ను అధికారులు నోటీసులు పంపి దానికి వివరణ కోరతారు. అందుకే ఎల్లప్పుడూ టాక్స్ ఫైలింగ్ కి సంబంధించిన రసీదులు, ఫ్రూఫ్స్ అందుబాటులో ఉంచుకోవటం ఉత్తమం అని అకౌంటింగ్ నిపుణులు చెబుతున్నారు.