September 1st Changes: సెప్టెంబరులో వచ్చిన కీలక మార్పులు ఇవే.. డోన్ట్ మిస్

September 1st Changes:  సెప్టెంబరులో వచ్చిన కీలక మార్పులు ఇవే.. డోన్ట్ మిస్

September News: ప్రతినెల మాదిరిగానే సెప్టెంబరు 1 నుంచి కొన్ని కీలకమైన నింబంధనల మార్పులు అమలులోకి వస్తున్నాయి. దీనికి తోడు ప్రజలు సెప్టెంబరులో ఖచ్చితంగా పూర్తి చేయాల్సిన కొన్ని పనుల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రజలను ఆర్థికంగా కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. 

1. ముందుగా సెప్టెంబర్ 1 నుంచి భారత ప్రభుత్వం దేశంలో విక్రయించే వెండి జ్యూవెలరీకి హాల్ మార్కింగ్ తప్పనిసరి చేసింది. దీనివల్ల ప్రజలు నాణ్యమైన వెండి వస్తువులు పొందటానికి వీలు కల్పించాలని నిర్ణయించింది ప్రభుత్వం. అలాగే వెండి అమ్మకాల్లో కొందరు వ్యాపారులు చేస్తున్న మోసాలను అరికట్టాలని, వ్యాపారాన్ని స్థిరమైన నిబంధనలతో రెగ్యులేట్ చేయాలని నిర్ణయించింది గవర్నమెంట్. 

2. ఇక రెండ ముఖ్యమైన అంశం ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైలింగ్. వాస్తవానికి కొన్ని టెక్నికల్ కారణాల చేత పన్ను శాఖ ఐటీఆర్ ఫైలింగ్ వాస్తవ గడువు జూలై 31ని  ఈ ఏడాది సెప్టెంబర్ 15 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. అందుకే ప్రజలు సెప్టెంబర్ స్టార్ట్ అయినందున ఆఖరి రోజు వరకు వేచి ఉండకుండా వెంటనే దానిని పూర్తి చేయాలి. దీని వల్ల చివరి నిమిషంలో చేసే తప్పులను నివారించవచ్చు. అలాగే ఆడిటింగ్ అవసరమైన వ్యక్తులు తమ ఐటీఆర్ అక్టోబర్ 31, 2025 నాటికి ఫైల్ చేయాల్సి ఉంటుందని గమనించాలి. 

3. సెప్టెంబర్ 1 నుంచి దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్ విషయంలో నిబంధనల మార్పులను అమలులోకి తీసుకొచ్చింది. దీంతో ఇతపై కార్డ్ హోల్డర్లు డిజిటల్ గేమింగ్, ప్రభుత్వ వెబ్ సైట్లు, కొందరు సెలెక్ట్ చేయబడిన మర్చంట్ల వద్ద చేసే చెల్లింపులకు ఎలాంటి రివార్డ్స్ పొందరని వెల్లడించింది. 

4. చివరిగా సెప్టెంబరులో వచ్చిన అతిపెద్ద మార్పుల్లో ఒకటి పెన్షన్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నేషనల్ పెన్షన్ విధానం నుంచి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కిందకు మారటానికి సెప్టెంబర్ 30 వరకు అవకాశం కల్పించబడింది.