సిబ్బందికి ఇబ్బంది కలగొద్దు : సూర్యనారాయణ

సిబ్బందికి ఇబ్బంది కలగొద్దు : సూర్యనారాయణ

మునగాల, వెలుగు : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ అధికారులను ఆదేశించారు. ఆదివారం మునగాలలో ఎన్నికల సామగ్రిని ఆర్డీవో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోదాడ డివిజన్ వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. పోలింగ్ సిబ్బందికి అకామిడేషన్, భోజన సౌకర్యం కల్పించాలని పంచాయతీ సెక్రటరీలకు సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ ఆంజనేయులు, మునగాల, బరాకత్ గూడెం పంచాయతీ సెక్రటరీలు, బీఎల్వలు, సిబ్బంది ఉన్నారు.