దమ్ముంటే గుడివాడలో పోటీ చేయ్.. చంద్రబాబుకి, కొడాలి నాని ఛాలెంజ్

దమ్ముంటే గుడివాడలో పోటీ చేయ్.. చంద్రబాబుకి, కొడాలి నాని ఛాలెంజ్

కృష్ణా జిల్లా గుడివాడలో టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొడాలి నాని, మాజీ సీఎం చంద్రబాబు కి ఓపెన్​ఛాలెంజ్​ విసిరారు. ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుకి దమ్ముంటే గుడివాడలో పోటీ చేయాలని సవాల్​ విసిరారు. ఈ నియోజవర్గానికి అల్లుడైనా ఎన్టీఆర్​ సొంత గ్రామానికీ ఆయన చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. బాబు హయాంలో వేసిన రోడ్లు 3 నెలలకే గోతులమయంగా మారేవన్నారు.

ఆయన మాట తాను విని ఉంటే చరిత్రహీనుడిగా మిగిలేవాడినన్నారు.  గుడివాడ ప్రజల కోసం చంద్రబాబు ఎకరం కొనుగోలు చేసినా రాజకీయాల నుంచి తప్పుకుంటాను వ్యాఖ్యానించారు. గుడివాడలో పేదలకు ఇళ్ల నిర్మాణం దివంగత వైఎస్సార్‌ రాజశేఖర్​రెడ్డి చలవే అన్నారు. టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్​ జగన్​, మంత్రి ఆదిమూలపు సురేష్​ తదితరులు పాల్గొన్నారు.