
- 60 ఫీట్ల రోడ్డుకు మార్కింగ్ చేసిన ఆఫీసర్లు
కొడంగల్, వెలుగు: ఎన్నో ఏండ్లుగా విస్తరణకు నోచుకుని కొడంగల్పట్టణ ప్రధాన రహదారి నిర్మాణ పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. రోడ్డు విస్తరణకు మున్సిపల్, ఆర్అండ్బీ అధికారులు బుధవారం మార్కింగ్వేశారు. సీఎం రేవంత్రెడ్డి ఇంటి నుంచి విస్తరణ పనులకు అధికారులు శ్రీకారం చుట్టారు.
సీఎం ఇంటి నుంచి వినాయక చౌరస్తా మీదుగా శ్రీమహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు 60 ఫీట్లతో రోడ్డు విస్తరణ చేయనున్నట్లు మున్సిపల్కమిషనర్ బలరాం నాయక్తెలిపారు. 60 ఫీట్ల రోడ్డుకు మధ్యలో డివైడర్, సెంట్రల్లైటింగ్అందుబాటులోకి రానుంది.
ఎట్టకేలకు రోడ్డు విస్తరణకు ఆటంకాలు తొలగి పనులు మొదలు కావడంతో పట్టణవాసులు సంతోషం పడుతున్నారు. అధికారులు ఇచ్చిన మార్కింగ్ ప్రకారం విస్తరణ ఉంటుందా లేదా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క రోడ్డుకు ఇరువైపులా ఉన్న షాపులు, ఇండ్ల యజమానులు ఆందోళన చెందుతున్నారు.