గులాబ్ ఎఫెక్ట్: కూలిన ఇల్లు.. మూడేళ్ల చిన్నారి, మహిళ మృతి

గులాబ్ ఎఫెక్ట్: కూలిన ఇల్లు.. మూడేళ్ల చిన్నారి, మహిళ మృతి

గులాబ్ తుఫాన్ ప్రభావంతో పశ్చిమ బెంగాల్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు కోల్‌కతాలో ఘోరం జరిగింది. సిటీలోని అహిరితోలా కాలనీలో రెండంతస్తుల బిల్డింగ్ కూప్పకూలిపోయింది. ఈ ఘటనలో మూడేళ్ల చిన్నారితో పాటు ఓ మహిళ మరణించింది. బిల్డింగ్ కూలిన విషయం తెలియగానే పోలీసులు, ఫైర్ సిబ్బంది వేగంగా అక్కడికి చేరుకున్నారు.

ఆ బిల్డింగ్‌లో ఉంటున్న రెండు కుటుంబాలు ఉంటున్నాయి. అందులో ఒక ఫ్యామిలీ చిన్న గ్యాప్‌లో తప్పించుకుంది. బిల్డింగ్‌లోని కొంత భాగం కూలకుండా ఉండడం, వాళ్లంతా అందులోనే ఉండిపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. కానీ మరో కుటుంబం చిక్కుకుపోయింది.  బిల్డింగ్ శిథిలాలను తొలగించి, అందులో చిక్కుకున్న వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారితో పాటు మరో మహిళ ప్రాణాలు కోల్పోయారు.

మరోవైపు గులాబ్ తుఫాను కారణంగా పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం కూడా కొన్ని చోట్ల వానలు కొనసాగుతున్నాయి. కోల్‌కతా సహా 24 పరగణా జిల్లా, ఈస్ట్ మిడ్నాపూర్, వెస్ట్ మిడ్నాపూర్, ఝర్గ్‌గ్రామ్, హౌరా, హుగ్లీ, ఈస్ట్, వెస్ట్ బర్ధమాన్, బిర్భుమ్ జిల్లాల్లో బుధవారం సాయంత్రం వరకూ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

మరిన్ని వార్తల కోసం..

సజ్జనార్‌‌కు దిశ కమిషన్ నోటీసులు.. సడన్‌గా వాయిదా

ఒకే స్కూల్‌లో 60 మంది స్టూడెంట్స్‌కు కరోనా

సాయి సుధను మెచ్చుకున్న ప్రధాని మోడీ