షారుఖ్ మాస్టర్ ప్లాన్.. తక్కువ డబ్బుతో ముగ్గురు మ్యాచ్ విన్నర్లను టార్గెట్ చేసాడు

షారుఖ్ మాస్టర్ ప్లాన్.. తక్కువ డబ్బుతో ముగ్గురు మ్యాచ్ విన్నర్లను టార్గెట్ చేసాడు

ఐపీఎల్ 2024 ప్రారంభానికి మరో నాలుగు నెలల సమయం ఉన్నా అందరి దృష్టి ఈ మెగా లీగ్ పైనే ఉంది. డిసెంబర్ 19 న జరగబోయే మెగా వేలమే దానికి కారణం. ఇప్పటికే ఫ్రాంచైజీలు రిలీస్ చేసిన వారిలో టాప్ ప్లేయర్లు ఉండడంతో ఈ మెగా వేలం కోసం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సారి కొంతమంది స్టార్ ప్లేయర్లు ఐపీఎల్ ఆడేందుకు ఆసక్తి చూపిస్తుండడంతో వేలంలో ఎవరు ఎక్కువ ధరకు అమ్ముడుపోతారనే సస్పెన్స్ అలాగే కొనసాగుతుంది. 

స్టార్ ప్లేయర్ల కోసం అన్ని జట్లు ఒక కన్నేస్తే, కేకేఆర్ ఓనర్ షారుఖ్ ఖాన్ మాస్టర్ ప్లాన్ వేసినట్టు సమాచారం. ఏకంగా ముగ్గురు మ్యాచ్ విన్నర్లను టార్గెట్ చేసి కోల్ కత్తా ను పటిష్టంగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ లిస్టులో వరల్డ్ కప్ హీరో ట్రావిస్ హెడ్, ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హేజల్ వుడ్, ప్రమాదకర బౌలర్ హర్షల్ పటేల్ ఉన్నారు. హేజల్ వుడ్, హర్షల్ పటేల్ ను ఆర్సీబీ రిలీజ్ చేయగా.. ట్రావిస్ హెడ్ తొలిసారి వేలంలో పాల్గొనబోతున్నాడు. 

ఆక్షన్ లో ఈ ముగ్గురిని తక్కువ ధరకే దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఈ త్రయం ప్రాధమిక ధర 2 కోట్ల నుంచి ప్రారంభమవుతుంది. కేకేఆర్ మిడిల్ ఆర్డర్ లో శ్రేయాస్ అయ్యర్, రింకు సింగ్, నితీష్ రానా, రస్సెల్ తో స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. కానీ ఆ జట్టుకు సరైన ఓపెనర్ లేడు. ఈ నేపథ్యంలో హెడ్ ను వేలంలో దక్కించుకునేందుకు ఆసక్తి చూపుతుంది. ఫాస్ట్ బౌలింగ్ లో కూడా బలహీనంగా కనిపిస్తున్న ఆ జట్టు హేజల్ వుడ్, హర్షల్ పటేల్ ను తీసుకోవాలని భావిస్తుంది.