వాస్తు బాగా లేదంట..కొల్లాపూర్

వాస్తు బాగా లేదంట..కొల్లాపూర్
  • ఆరేండ్లుగా కొల్లాపూర్​ ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​ కడ్తనే ఉన్నరు

నాగర్​ కర్నూల్, వెలుగు: జిల్లాలోని మూడు నియోజకవర్గ కేంద్రాల్లో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీసులు ఎన్నడో ప్రారంభం కాగా, కొల్లాపూర్​ ఎమ్మెల్యే క్యాంప్  ఆఫీస్​ పనులు మాత్రం మధ్యలో నిలిచిపోయాయి. పనులు ఎందుకు ఆగిపోయాయని అడిగితే, ఆర్అండ్​బీ ఇంజనీర్లు సమాధానం చెప్పడం లేదు. ఆరేండ్ల కింద పనులు ప్రారంభించి, నాలుగేండ్ల కింద పిల్లర్లు, స్లాబ్​ వేసి వదిలేశారు. మొండి గోడలతో పిచ్చి చెట్ల మధ్య భూత్​బంగ్లాగా మారింది. 

అన్ని క్యాంప్​ ఆఫీసుల మాదిరిగానే..

అన్ని నియోజకవర్గ  కేంద్రాల మాదిరిగానే కొల్లాపూర్​లో ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​ కట్టడానికి 2016 అక్టోబర్​లో రూ. కోటి కేటాయించారు. మండల పరిషత్​ కాంప్లెక్స్​ ఆవరణలో స్థలం కేటాయించారు. కొల్లాపూర్​లో కల్వకుర్తి గెస్ట్​ హౌజ్​ను అనఫిషియల్​ క్వార్టర్​గా వినియోగించుకున్న జూపల్లి కృష్ణారావు, 2018లో ఎమ్మెల్యేగా గెలిచిన బీరం హర్షవర్దన్​రెడ్డి పెండింగ్​లో ఉన్న క్యాంప్​ ఆఫీస్​ పనులు కంప్లీట్​ చేయడంపై పెద్దగా ఇంట్రెస్ట్​ తీసుకోలేదు. నాలుగేండ్లుగా అసంపూర్తిగా మిగిలిపోయిన బిల్డింగ్​ వాస్తు బాగా లేదనే ప్రచారం కూడా ఉంది. అందులోకి వెళ్తే ఫ్యూచర్​ ఉండదన్న ప్రచారం జరిగింది. 2018లో పనులు కంప్లీట్​చేసి అప్పగించాలని అగ్రిమెంట్​ ఉన్నా సంబంధిత అధికారులు దీని ఊసెత్తడం లేదు. ఆర్అండ్​బీ స్టేటస్​ రిపోర్ట్​లో మాత్రం వర్క్​ కంప్లీట్​ అని పేర్కొన్నారు.