మాళవికను వెయిట్​ చేయిస్తున్న.. స్టార్ హీరో ఎవరంటే?

మాళవికను వెయిట్​ చేయిస్తున్న.. స్టార్  హీరో ఎవరంటే?

కోలీవుడ్​ బ్యూటీ మాళవికా మోహనన్(Malavika Mohanan)​ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. రజనీకాంత్​ ‘పేట’ సినిమాతో ఈ నటి కోలీవుడ్​కి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత విజయ్​తో మాస్టర్​ సినిమాలో మెరిసింది. ఈ బ్యూటీ చేతిలో ఉన్న బడా ప్రాజెక్ట్స్​లో విక్రమ్​ తంగళన్(Thangalaan)​ కూడా ఒకటి. ఈ మూవీలో మాళవిక లీడ్​ రోల్​ చేసింది. షూటింగ్​ టైంలో విక్రమ్​ గాయపడటంతో ఈ మూవీ ఆలస్యంగా పూర్తైంది.

లేటెస్ట్ గా ఈ సినిమా గురించి మాళవిక మాట్లాడుతూ తంగళన్​ కోసం తానెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు తెలిపింది. తనకు కూడా మూవీ అప్​డేట్​ ఇంకా అందలేదని..దర్శకుడు ఫోన్​ కోసం వెయిట్​ చేస్తున్నానంది. కాగా ఇటీవల మాళవికా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా తంగళన్ చిత్ర అప్‌డేట్‌ గురించి స్పందించింది.

ALSOREAD:ప్రభాస్ సలార్ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?

పా రంజిత్​ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను జ్ఞాన్​వేల్ రాజా నిర్మించాడు. విక్రమ్​ ముందెన్నడూ చేయని కొత్త గెటప్​లో కనిపించి అంచనాలు పెంచేశాడు. తన కెరీర్​ను టర్న్​ చేసే సినిమాగా తంగలాన్​ నిలుస్తుందని మాళవిక హోప్స్​ పెట్టుకుంది. 

తంగళన్ షూటింగ్ జూలైలో పూర్తయింది మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మూవీ బ్రిటిష్ పాలనలో కోలార్ గోల్డ్ ఫ్యాక్టరీ లో జరిగిన యదార్ధ సంఘటనను ఆధారం చేసుకుని ఈ మూవీ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. గత సంవత్సరం అక్టోబర్ లో షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ మూవీ నుంచి త్వరలో అప్డేట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. కాగా తంగళన్‌ మూవీని ఆస్కార్‌కు తీసుకెళ్లాలని మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం.