ప్రభాస్ సలార్ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?

ప్రభాస్ సలార్ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్(Salar). కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth neel) తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా అనుకోకుండా పోస్ట్ పోన్ చేసి వాళ్ల ఆశలపై నీళ్లు చల్లేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. మరికొన్ని రోజుల్లో సినిమా రిలీజ్ అవనుంది అని ఆశప్పడ్డ వాళ్లకి బ్యాడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. దీంతో సలార్ కొత్త రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. 

ALSOREAD:మాళవికను వెయిట్​ చేయిస్తున్న.. స్టార్ హీరో ఎవరంటే?

తాజాగా సలార్ కొత్త రిలీజ్ డేట్ ఇదే అంటూ ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వార్త ప్రకారం ఈ సినిమా నవంబరు 10న రిలీజ్ కానుందట. ముందుగా ఈ సినిమాను సెప్టెంబరు 28న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్. కానీ.. సినిమాలో VFX వర్క్ చాలా పెండింగ్ ఉండటంతో మరోసారి పోస్ట్ పోన్ చేశారు. కొత్త న్యూస్ ప్రకారం సలార్ నవంబర్ 10న అయినా వస్తుందా? లేదా? అనేది చూడాలి మరి. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.