
వయనాడ్ లోని ముండక్కై, చూరల్ మలలో ఆర్మీ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ చేస్తోంది. మంగళవారం తెల్లవారుజామున కేరళలో కొండచరియాలు విరిగిపడి ప్రకృతి బీభత్సం సృష్టించింది. గురువారం నాటికి మృతుల సంఖ్య 293 మందికి చేరుకుంది. బుధవారం రెస్య్కూ టీంలు 1000మందిని కాపాడారు. 200 మంది గాయపడ్డారు.. మరో 240 మంది గల్లంతయ్యారు. డిజాస్టర్ మానేజ్‌మెంట్ గ్రూపులు కమాండ్ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
విలనాగడ్ ప్రాంతంలో వరదలో చిక్కున్న వారిన కాపాడిన మాథ్యూ నీటిలో కొట్టుకుపోయాడు. మాథ్యూ కులంతింకల్ (58) స్థానికంగా స్కూల్ టీచర్. నెడుతరియిల్ సిన్సే అనే పరుగింటి వారిని కాపాడి.. మాథ్యూ కొట్టుకుపోయాడు. అతనికి భార్యా, ఐదుగురు పిల్లలు ఉన్నారు. సహాయక బృందాలు గురువారం మంజచీలిలో మాథ్యూ మృతదేహాన్ని రికవరీ చేసుకున్నాయి. పోస్ట్ మార్టం అనంతరం విలంగాడ్ లోని సెయింట్ జార్జ్ చర్చ్ శ్మశాన వాటికలో మాథ్యూ అంత్యక్రియలు నిర్వహించారు.