ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

నేరడిగొండ/దహెగాం, వెలుగు: కృష్ణాష్టమి వేడుకలను ఉమ్మడి జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు.  నేరడిగొండ మండల కేంద్రంలోని మథుర (కాయితి లంబాడ) కులస్తులు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు . మహిళలంతా కలిసి మట్టితో శ్రీకృష్ణుడి ప్రతిమను తయారు చేసి, తమ ఇండ్లలో ప్రతిష్టించారు. ఓమ, బంక, బెల్లం , గోధుమ పిండి వంటి మిశ్రమంతో చేసిన నైవేద్యాన్ని శ్రీకృష్ణుడికి సమర్పించారు. 

మండల కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్ స్కూల్​లో చిన్నారులు వేసిన శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలు ఆకట్టుకున్నాయి. దహెగాం మండల కేంద్రంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. శివకేశవాలయంలో ఎక్కాహం నిర్వహించారు. శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఊరేగింపుగా మర్రిచెట్టు వద్దకి తీసుకెళ్లి శ్రీకృష్ణుడు గోపికల చీరెలు దొంగిలించే సన్నివేశాన్ని  గేయ నాటిక రూపంలో ప్రదర్శించారు. ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించి విజేతలకు నగదు బహుమతి అందజేశారు.