
గ్లామరస్ క్యారెక్టర్స్‌తో మెప్పిస్తూనే ఫిమేల్ సెంట్రిక్ సినిమాల వైపు మొగ్గు చూపుతోంది కృతీసనన్. ఆల్రెడీ ‘మిమీ’లో సరొగేట్ మదర్‌గా నటించి మార్కులు కొట్టేసింది. ఇప్పుడు అనురాగ్ కశ్యప్ డైరెక్షన్‌లో మరొక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి ఎస్ చెప్పింది. ఈ విషయాన్ని అనురాగ్ స్వయంగా రివీల్ చేశాడు. నిర్మాత నిఖిల్ ద్వివేది దాన్ని సోషల్ మీడియాలో కన్‌ఫర్మ్ చేశాడు. ప్రస్తుతం తాప్సీతో ‘దొబారా’ సినిమాని తెరకెక్కిస్తున్నాడు అనురాగ్. అది పూర్తయ్యాక ఈ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇక కృతి ఆదిపురుష్, షెహ్‌జాదా, భేడియా, గణపత్ లాంటి భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తోంది. ఆమె అక్షయ్‌తో కలిసి నటించిన ‘బచ్చన్ పాండే’ రిలీజ్‌కి రెడీ అవుతోంది. మొత్తానికి స్ట్రాంగ్ రోల్స్‌తో బాలీవుడ్‌లో తన స్థానాన్ని మరింత స్ట్రాంగ్ చేసుకుంటున్న కృతి.. సినిమా భారాన్ని తాను ఒంటరిగా మోయగలననే నమ్మకాన్ని ఫిల్మ్ మేకర్స్‌కి కలిగిస్తోంది.