KritiSanon: IMDB వరల్డ్‌‌ టాప్‌‌ టెన్‌ బ్యూటీస్ లిస్ట్ రిలీజ్.. ప్రభాస్ ‌హీరోయిన్ ఎన్నో స్థానమంటే?

KritiSanon: IMDB వరల్డ్‌‌ టాప్‌‌ టెన్‌ బ్యూటీస్ లిస్ట్ రిలీజ్.. ప్రభాస్ ‌హీరోయిన్ ఎన్నో స్థానమంటే?

బాలీవుడ్ హీరోయిన్‌‌ కృతిసనన్ (Kriti Sanon) అరుదైన ఘనతను అందుకుంది. ప్రపంచంలోని టాప్‌‌ 10 అందమైన హీరోయిన్స్‌‌లో ఒకరిగా నిలిచింది. లేటెస్ట్గా ఇంటర్నెట్‌‌ మూవీ డేటాబేస్‌‌ (IMDB) సంస్థ ప్రపంచంలోనే అత్యంత అందమైన హీరోయిన్స్‌‌ ఎవరనే విషయంపై టాప్‌‌ 10 జాబితాను విడుదల చేసింది.

ఇందులో ఆమె ఐదో స్థానంలో నిలిచింది. మన దేశంలో ఎంతోమంది అందమైన హీరోయిన్స్‌‌ ఉన్నప్పటికీ అందులో కృతిసనన్ మాత్రమే చోటు సంపాదించుకుంది. గ్లోబల్ సెలబ్రిటీస్‌‌ అయిన ఎమ్మా వాట్సన్‌‌, అనా డె అర్మాస్‌‌ లాంటి వాళ్లతో కలిసి టాప్‌‌ టెన్‌ లిస్ట్‌‌లో ఆమె చేరడంతో అంతర్జాతీయ స్థాయిలో తనకు ఫాలోయింగ్‌‌ పెరుగుతున్నట్టు అర్థమవుతోంది.

ఇప్పటికే నేషనల్‌‌ అవార్డ్‌‌,  రెండు ఫిల్మ్ ఫేర్‌‌‌‌ అవార్డ్స్‌‌ సహా ఎన్నో గౌరవాలను కృతి అందుకుంది. అలాగే ఫోర్బ్స్‌‌ ఇండియా 2019 సెలబ్రిటీ 100 జాబితాలోనూ ఆమె స్థానం పొందింది. ప్రస్తుతం ఆమె ‘తేరే ఇష్క్‌‌ మే’చిత్రంలో నటిస్తోంది. అలాగే కాక్‌‌ టైల్‌‌ 2, డాన్‌‌ 3 చిత్రాల్లోనూ హీరోయిన్‌‌గా తన పేరు వినిపిస్తోంది.

కృతి సనన్.. తెలుగులో మహేష్ బాబు నటించిన నేనొక్కడినే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అటు హిందీలో జాకీ ష్రోఫ్ కొడుకు టైగర్ ష్రోఫ్ సరసన హీరోపంతితో తెరంగేట్రం చేసింది. తెలుగులో నాగ చైతన్యతో దోచేయ్, ప్రభాస్ సరసన ఆది పురుష్‌ (సీత పాత్ర) వంటి సినిమాలతో తెలుగు ఆడియన్స్కు దగ్గరైంది. 

వరల్డ్‌‌ టాప్‌‌ టెన్‌‌ హీరోయిన్స్​ లిస్ట్ 2025:

1. మెకెన్నా గ్రేస్ - USA 

2. జూలియా బటర్స్ - USA 

3. హనియా అమీర్ - పాకిస్తాన్

4. నాన్సీ మెక్‌డోనీ - USA/దక్షిణ కొరియా

5. కృతి సనన్ - ఇండియా 

6. దిల్రాబా దిల్మురత్ - చైనా 

7. షైలీన్ వుడ్లీ - USA 

8. మార్గోట్ రాబీ - ఆస్ట్రేలియా 

9. అనా డి అర్మాస్ - క్యూబా/స్పెయిన్ 

10. ఎమ్మా వాట్సన్ - UK