దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు వేదికలు

దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు వేదికలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఓబులాపూర్‎లో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతరకు హాజరై వన దేవతలను మంత్రి కేటీఆర్ దర్శించుకున్నారు. అనంతరం తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లిలో క్లస్టర్ రైతు వేదికను ప్రారంభించారు. అక్కడ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

‘రాష్ట్రవ్యాప్తంగా 2603 రైతు వేదికలను దేశంలో ఎక్కడా లేని విధంగా  ఏర్పాటుచేశాం. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి, రైతాంగానికి మద్ధతుగా నిలిచింది.  ఈ రైతు వేదికల ద్వారా  రైతు సంఘటిత శక్తిని దేశానికి చూపిస్తున్నాం.  ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి.. దానికి ఓ అధికారిని నియమిస్తున్నాం. ఈ ఘనత కేసీఆర్‎కే దక్కుతుంది. ఉచిత కరెంట్, రైతు బంధు, రైతు బీమా ఇవన్నీ ఒక్క తెలంగాణాలోనే అమలవుతున్నాయి. కాళేశ్వరం జలాల వల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూగర్భజలాలు దాదాపు ఆరు మీటర్లు పెరిగాయి.ఇక్కడున్న నీటిపారుదల విధి విధానాలు యువ ఐఏఎస్‎లకు పాఠ్యాంశాలుగా మారడం యావత్ తెలంగాణకే గర్వకారణం’ అని కేటీఆర్ అన్నారు.

For More News..

చదువుకున్న అమ్మాయిలే టార్గెట్ గా 17 పెళ్లిళ్లు

వైరల్ అవుతున్న సమంత డ్యాన్స్ వీడియో