నిజామాబాద్ లో నిత్యం రద్దీగా ఉండే కుమార్ గల్లీ షాప్స్యజమానుల ఆందోళనకు దిగారు. కుమార్ గల్లీ లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో ఇబ్బందులు పడుతున్నామని కుమార్ గల్లీ షాప్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం దుకాణాలు క్లోజ్చేసి బారికేడ్ల వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా షాప్స్ యజమానులు మాట్లాడారు.
బారికేడ్లను ఏర్పాటు చేయడంతో కొనుగోలుదారుల వాహనాలు లోనికి రావడం లేదని, దీంతో తమ వ్యాపారాలు సరిగ్గా నడవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో దుకాణ యజమానులు గోపాల్, శ్రీధర్, మహేందర్, రవీందర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
- వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్