ఏ పదవీ కోరుకోవట్లేదు.. సీఎం అయ్యే అవకాశం రావొచ్చేమో : జానారెడ్డి

ఏ పదవీ కోరుకోవట్లేదు.. సీఎం అయ్యే అవకాశం రావొచ్చేమో : జానారెడ్డి

 కాంగ్రెస్ సీనియర్ నేత,  మాజీ మంత్రి జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  పదువుల రేసులో తాను  లేనని,  పదవులే తనని అందుకుంటాయని చెప్పారు.  పీవీ నరసింహారావు ప్రధానమంత్రి ఎలా అయ్యారో అలానే తాను కూడా సీఎం అవచ్చనని చెప్పారు. ఆరు నెలల్లో పదవిలోకి రావడానికి తన   కొడుకు రాజీనామా చేస్తాడని, తాను పోటీ చేసి గెలుస్తానన్నారు. 

ప్రజల హృదయాల్లో తాను సీఎం కావాలని ఉందన్నారు జానారెడ్డి.   తనకు తానుగా  ఏ పదవీ కోరుకోవట్లేదని,  సీఎం అయ్యే అవకాశం హఠాత్తుగా రావచ్చేమోనని చెప్పారు.  ఏ పదవి వచ్చినా తాను  కాదనని చెప్పిన ఆయన.  ఏ సీఎం చేయనన్ని శాఖలు తాను చేశానని తెలిపారు. మంగళవారం నల్గొండ జిల్లా గుర్రంపోడులో నిర్వహించిన కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో జానారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.