కుంటాలకు జలకళ

కుంటాలకు జలకళ

రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతంగా పేరొందిన నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతానికి జలకళ సంతరించుకుంది. రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద నీరు చేరి కనువిందు చేస్తోంది. జలపాతానికి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా ఆకుపచ్చని చెట్లు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. 

- వెలుగు, నేరడిగొండ