కురుమూర్తి స్వామి ఆదాయం రూ.30.58 లక్షలు

కురుమూర్తి స్వామి ఆదాయం రూ.30.58 లక్షలు

చిన్నచింతకుంట, వెలుగు: కురుమూర్తి స్వామి ఆలయంలో సోమవారం మూడో విడత హుండీ లెక్కింపు చేపట్టారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులు స్వామికి సమర్పించిన మొక్కులను టెంపుల్  ఆవరణలో లెక్కించారు. రూ.30,58,980 ఆదాయం సమకూరినట్లు ఈవో మదనేశ్వర్ రెడ్డి తెలిపారు.