ముగిసిన చిన్నచింతకుంట కురుమూర్తి బ్రహ్మోత్సవాలు

ముగిసిన  చిన్నచింతకుంట కురుమూర్తి బ్రహ్మోత్సవాలు

చిన్నచింతకుంట, వెలుగు: పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ముక్కర వంశ రాజులు చేయించిన ఆభరణాలు తొలగింపుతో అధికారికంగా ముగిశాయి. ఉదయం ఆలయ అర్చకులు స్వామివారి ఆభరణాలను దేవాదాయ శాఖ అధికారులకు అప్పగించారు. 

ప్రత్యేక పూజల అనంతరం దేవాలయ చైర్మన్  గోవర్దన్ రెడ్డి, ఈవో మదనేశ్వర్ రెడ్డి, ఎస్సై కృష్ణ ఓబుల్ రెడ్డి ఆభరణాలను పోలీస్​ ప్రత్యేక వాహనంలో బందోబస్తు నడుమ వనపర్తి జిల్లా ఆత్మకూర్  ఎస్బీఐ బ్రాంచ్​కు తరలించారు. అక్కడ ఆభరణాలను లాకర్లలో భద్రపరిచారు. 

గత నెల ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 28 రోజుల పాటు కొనసాగాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘటమైన స్వామివారి అలంకరణ, ఉద్దాల మహోత్సవం వైభవంగా జరిగాయి. రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. 

టెంపుల్  మెంబర్స్  కమలాకర్, భారతమ్మ, గోపాల్, నాగరాజు, ఉంద్యాల శేఖర్, బాదం వెంకటేశ్వర్లు, చక్రవర్ధన్ రెడ్డి, భాస్కరాచారి, ఆలయ అర్చకులు వెంకటయ్య, సత్యనారాయణ, అనంత విజయ్, లక్ష్మీనరసింహ చార్యులు, వెంకటేశ్​ పాల్గొన్నారు