చిన్నారి మిస్సింగ్.. కిల్లర్ ఎవరనేది చివరివరకు సస్పెన్స్.. తెలుగులో ఉత్కంఠరేపుతున్న తమిళ క్రైమ్ థ్రిల్లర్

చిన్నారి మిస్సింగ్.. కిల్లర్ ఎవరనేది చివరివరకు సస్పెన్స్.. తెలుగులో ఉత్కంఠరేపుతున్న తమిళ క్రైమ్ థ్రిల్లర్

ఈ వీకెండ్ (డిసెంబర్ 7) చూడాల్సిన అతిముఖ్యమైన ఓటీటీ సినిమాల్లో ఒకటి "కుట్రమ్ పురింధవన్" (Kuttram Purindhavan). 'ది గిల్టీ వన్' అనేది క్యాప్షన్. ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తెలుగులోనూ స్ట్రీమ్ అవుతుంది.

ఈ సిరీస్ డిసెంబర్ 4 నుంచి సోనీ లివ్‌‌‌‌ ప్లాట్​ఫాంలో అందుబాటులోకి వచ్చి ప్రస్తుతం హయ్యెస్ట్ వ్యూస్తో దూసుకెళ్తోంది. ఇందులో వర్సటైల్ యాక్టర్ పశుపతి, విదార్థ్ ప్రధాన పాత్రల్లో నటించి శభాష్ అనిపించుకున్నారు. వీరితో పాటే లిజ్జీ ఆంటోనీ, లక్ష్మీ ప్రియ చంద్రమోళి, అజిత్ కోషీ, మున్నార్ రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

సెల్వమణి దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ ఓ పాప మిస్సింగ్ కేసు చుట్టూ తిరుగుతుంది. టైటిల్ కింద క్యాప్షన్ గమనిస్తే "ది గిల్టీ వన్" లోనే.. కథ, కథనం ఆసక్తి కలిగించే అంశంగా ఉంది. అంటే 'జీవితంలో చేసిన తప్పు.. దాచి పెట్టలేనంత పెద్దది' అనే క్యాప్షన్ వివరిస్తుంది.

అందుకు తగ్గట్టుగానే సిరీస్ మొదట్లోనే ఓ వ్యక్తి రక్తపు మడుగులో ఉండటం, ఆ తర్వాత చనిపోయిన ఆ వ్యక్తి కూతురు మిస్సవ్వడం.. ఇక ఆ చుట్టూ పోలీసుల రసవత్తరమైన ఇన్వెస్టిగేషన్.. అందుకు తగ్గట్టుగానే ఇందులో చుట్టూవున్నవారే అనుమానితులుగా ఉండటం.. పూర్తి కథనంపై అనుక్షణం ఇంట్రెస్ట్ కలిగిస్తోంది. ఇక ఆ క్రమంలోనే పాప చుట్టూ సాగే ఇన్వెస్టిగేషన్ అంతా కొత్త మలుపులు తీసుకోవడంతో కథనం మరింత వేగంగా పరిగెడుతూ ఆడియన్స్కి ఉత్కంఠ కలిగిస్తోంది. మొత్తం 7 ఎపిసోడ్స్గా ఉన్న ఈ సిరీస్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా చూసేయండి. చక్కని థ్రిల్లింగ్ రైడ్ ఇస్తుంది.

కథేంటంటే:

భాస్కరన్ (పశుపతి) గవర్నమెంట్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌లో ఫార్మసిస్ట్‌‌‌‌గా పనిచేస్తుంటాడు. అతని మనవడు రాహుల్ (సాయి శరణ్) మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతుంటాడు. భాస్కరన్‌‌‌‌ రిటైర్మెంట్‌‌‌‌ తర్వాత వచ్చే డబ్బుతో అతనికి ఆపరేషన్‌‌‌‌ చేయించాలి అనుకుంటాడు. వాళ్ల ఇంటి ఎదురుగా ఉన్న ఇంట్లో ఎస్తేర్‌‌‌‌‌‌‌‌ (లక్ష్మీ ప్రియ చంద్రమౌళి) తన కూతురు మెర్సీతో కలిసి ఉంటుంది. ఆమె భర్త తాగుబోతు. దాంతో అప్పుడప్పుడు వాళ్లకు భాస్కరన్‌‌‌‌ కూడా సాయం చేస్తుంటాడు.

అయితే.. ఒకరోజు అనుకోకుండా ఆమె భర్త హత్యకు గురవుతాడు. అప్పుడే మెర్సీ కూడా కనిపించకుండా పోతుంది. మెర్సీ అదృశ్యం గురించి భాస్కరన్‌‌‌‌కు తెలిసినప్పటికీ కొన్ని కారణాల వల్ల బయటికి చెప్పలేకపోతాడు. మరోవైపు సస్పెండ్‌‌‌‌ అయిన పోలీస్​ ఆఫీసర్ గౌతమ్ (విదార్త్) ఈ కేసుని రహస్యంగా దర్యాప్తు చేస్తుంటాడు. చివరికి ఏం జరిగింది? మెర్సీకి ఏమైంది? తెలియాలంటే సిరీస్ చూడాలి.