కాళేశ్వరంతో పేద ప్రజల సొమ్ము లక్ష కోట్లు దోచుకున్నారు : గడ్డం వంశీ కృష్ణ

కాళేశ్వరంతో పేద ప్రజల సొమ్ము లక్ష కోట్లు దోచుకున్నారు : గడ్డం వంశీ కృష్ణ

బీఆర్ఎస్ పార్టీ పై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ. పది యేండ్లు అధికారంలో ఉండి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వని పార్టీ బీఆర్ఎస్ అని విమర్శించారు. తెలంగాణను 6 లక్షల కోట్ల అప్పుల ఊబిలో నెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టుతో పేద ప్రజల సొమ్ము లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నారని ఫైర్ అయ్యారు. 

ఇంటి ఇంటికి ఉద్యోగాలు అని చెప్పిన కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేశాడని విమర్శించారు. కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యే విజయ రమణారావు తో కలిసి పత్తిపాక రిజర్వాయర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.  గత పదేండ్లుగా కష్టపడి పని చేసిన కార్యకర్తలకు తన ధన్యవాదాలని అన్నారు. 

పెన్షన్ స్కీమ్,  ఉపాధి హామీ పథకం వంటివి అమలు చేసిందే కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు.  కాక స్ఫూర్తి తో సంస్థ పెట్టి 500 ఉద్యోగాలు కల్పించానని తెలిపారు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ సంస్థలను తీసుకువచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. మీ చిన్న కొడుకు లా భావించి ఆశీర్వదించి గెలిపిస్తే పెద్దపెల్లిని అన్ని రంగాల్లో ముందుంచుతానని గడ్డం వంశీ కృష్ణ తెలిపారు.