పాలమూరు అభివృద్ధికి ఎన్నారైలు సహకరించాలి : లక్ష్మీనరసింహ రెడ్డి

పాలమూరు అభివృద్ధికి ఎన్నారైలు సహకరించాలి : లక్ష్మీనరసింహ రెడ్డి

ఆమనగల్లు, వెలుగు: ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధికి ఈ ప్రాంత ప్రవాస భారతీయులు చేయూత అందించాలని రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనరసింహ రెడ్డి కోరారు. అమెరికా తెలుగు సంఘం (ఏటీఏ) వేడుకల్లో భాగంగా జార్జియాలో జరిగిన బిజినెస్ ఫారం పొలిటికల్ అఫైర్స్ – పాలమూరు ఎన్నారై ప్రత్యేక సమావేశంలో ఆయనతోపాటు ఎమ్మెల్యేలు రాజేశ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, అనిరుద్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లక్ష్మినరసింహరెడ్డి మాట్లాడుతూ.. పాలమూరులో విద్యాభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఎన్నారైలు తమ వంతు సహకారం అందించాలని కోరారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి ద్వారా ప్రత్యేక నిధులు మంజూరు చేయించాలని ఎమ్మెల్యేలకు ఆయన విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పాలమూరు ప్రవాస భారతీయులు కిషోర్, జగదీశ్వర్ రెడ్డి, భరత్, నర్సింహారెడ్డి, సాయి, సుభాష్, రామకృష్ణ, లక్ష్మణ్ పాల్గొన్నారు.