లాలూకు బెయిల్.. త్వరలోనే విడుదల!

లాలూకు బెయిల్.. త్వరలోనే విడుదల!

బీహార్ పశుగ్రాసం కుంభకోణానికి సంబంధించిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్‌కు జార్ఖండ్ హైకోర్టు ఇచ్చింది. ‘దుమ్కా ట్రెజరీ కేసు’గా పిలువబడే ఈ కేసులో ఆయన జార్ఖండ్ జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1991 మరియు 1996 సంవత్సరాల మధ్య పశుగ్రాసం కోసం కేటాయించిన నిధులలో రూ. 3.13 కోట్లను వాడుకున్నారని అభియోగం. ఈ కేసుకు సంబంధించి యాదవ్ మీద నాలుగు కేసులు నమోదయ్యాయి. వాటిలో మూడింటికి గతంలోనే బెయిల్ వచ్చింది. తాజాగా నాలుగో కేసులో కూడా బెయిల్ రావడంతో ఆయన బెయిల్ మీద విడుదలకానున్నారు. ప్రస్తుతం యాదవ్ అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన 2017 డిసెంబర్ నుంచి జైలులో ఉన్నారు. లాలూ తన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో పోయినేడాది మాత్రమే ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు.

లాలూ జైలులో ఉన్నప్పుడు పార్టీని ఆయన కొడుకు తేజశ్వి యాదవ్ ముందుండి నడిపించాడు. గత ఏడాది జరిగిన బీహార్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు దక్కించుకొని పార్టీని అతిపెద్ద పార్టీగా మార్చాడు. అయితే ప్రతిపక్ష నితీష్ కుమార్ పార్టీ జనతాదళ్ యునైటెడ్ .. బీజేపీతో కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది.