ఒక్క రోజే రూ.135 కోట్లు

ఒక్క రోజే రూ.135 కోట్లు

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ భూములు, ఆస్తుల మార్కెట్ వాల్యూను మరోసారి పెంచేందుకు సిద్ధం కావడంతో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు జోరుగా సాగుతున్నాయి. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 9,758  డాక్యుమెంట్లు రిజిస్టర్​ అయ్యాయి. రిజిస్ట్రేషన్లతోపాటు  ఈ–స్టాంప్స్  చలానాల చెల్లింపుల ద్వారా రూ. 135 కోట్ల ఆదాయం సమకూరింది. రిజిస్ట్రేషన్ల శాఖ ఖజానాకు సోమవారం రూ. 65 కోట్లు, మంగళవారం రూ. 72 కోట్లు, గురువారం రూ. 138 కోట్ల ఆదాయం వచ్చింది. బుధవారం రిపబ్లిక్ డే రోజు కూడా ఆన్ లైన్ లో ఇ–స్టాంప్స్ చలానాల చెల్లింపుల ద్వారా రూ. 10 కోట్ల ఇన్ కం వచ్చింది. సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్ ఆఫీసులు విజిటర్లతో కిటకిటలాడుతున్నాయి.