పేదలు వేసుకున్న గుడిసెలపై భూ కబ్జాదారుల వీరంగం

పేదలు వేసుకున్న గుడిసెలపై భూ కబ్జాదారుల వీరంగం

పేద ప్రజలు వేసుకున్న గుడిసెలపై భూ కబ్జాదారులు రౌడీయిజం చూపించారు. పెట్రోల్ పోసి గుడిసెలను కాలబెట్టారు. కళ్ల ముందే గుడిసెలు కాలిపోవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. 

చెన్నూరు మండలం బావురావుపేట శివారులో కొంత కాలంగా పేద ప్రజలు గుడిసెలు వేసుకొని నివాసముంటున్నారు. చుట్టు పక్కల ఉన్న గ్రామాల్లోకి పనికి వెళ్తూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే పేదలు వేసుకున్న గుడిసెలపై భూ కబ్జాదారులు రాక్షసంగా వ్యవహరించారు. గుడిసెల్లో  నివసించే వారికి ముందస్తు సమాచారం ఇవ్వకుండా.. పెట్రోల్ పోసి వాటికి నిప్పటించారు. 

దీంతో బాధితులు లబోదిబోమన్నారు.  మంటల్లో నిత్యావసరం వస్తువులు, డబ్బులు పూర్తిగా కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. భూ కబ్జాదారులను అడ్డుకునేందుకు ప్రజలు యత్నించగా..వారిపై దాడికి పాల్పడారు. గుడిసెలను కాలబెట్టడంతో తాము నిరాశ్రయులయ్యామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరారు.