రాజపక్స రాజీనామా చేయాలని విపక్షాల డిమాండ్

రాజపక్స రాజీనామా చేయాలని విపక్షాల డిమాండ్

శ్రీలంకలో అధ్యక్ష తరహా పాలనావ్యవస్థ రద్దు చేయాలని ప్రతిపాదించింది ప్రధాన ప్రతిపక్ష పార్టీ సమగీ జన బలవేగయ SJB. దాని స్థానంలో ప్రజాస్వామ్య విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ పార్లమెంటులో గురువారం రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని నివారించడంలో రాజపక్స ప్రభుత్వం విఫలమైనందని ఆరోపించారు. అధ్యక్ష పదవికి రాజపక్స రాజీనామా చేయాలని శ్రీలంక వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. 1978 నుంచి అమల్లో ఉన్న కార్యనిర్వాహక అధ్యక్ష తరహా పాలనా వ్యవస్థ రద్దు కోరుతూ...21వ రాజ్యాంగ సవరణ ముసాయిదా బిల్లును స్పీకర్ కు సమర్పించినట్లు తెలిపారు SJB నేత సాజిత్ ప్రేమదాస. బిల్లు ఆమోదం పొందితే... అధ్యక్షుడు దేశాధినేతగా కమాండర్ ఇన్ చీఫ్ గా కొనసాగుతారు. ప్రధానమంత్రి నియామకం, తొలగింపులో మాత్రం వ్యక్తిగత విచక్షణను వాడే అధికారం ఉండదు.

మరిన్ని వార్తల కోసం

ఫుడింగ్ పబ్ కేసు నిందితులకు మరో షాక్

రెండ్రోజుల్లో మోడీ విజిట్.. కశ్మీర్లో ఎన్కౌంటర్