మొతేరా క్రికెట్ స్టేడియానికి ప్రధాని మోడీ పేరు

మొతేరా క్రికెట్ స్టేడియానికి ప్రధాని మోడీ పేరు

అహ్మదాబాద్: ఓవైపు సబర్మతి నదీ .. మరోవైపు వరల్డ్‌‌‌‌ లార్జెస్ట్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ స్టేడియం.. చూడటానికి రెండు కళ్లు సరిపోనంత విశాలమైన గ్రౌండ్‌‌‌‌. అందులోని వసతులను చూస్తే.. ప్రపంచం మొత్తం తిరిగే క్రికెటర్లు కూడా ఔరా అని ముక్కున వేలేసుకున్నారు. 1982లో నిర్మించిన స్టేడియాన్ని కూల్చేసి దాని స్థానంలో రీ కన్‌‌‌‌స్ట్రక్ట్‌‌‌‌ చేసిన నయా మొతెరాలో అడుగడుగున అబ్బురపరిచే అంశాలు కనబడుతాయి. వరల్డ్ లార్జెస్ట్ క్రికెట్ స్టేడియమైన సర్దార్ పటేల్ క్రికెట్ స్టేడియంకు ప్రధాని మోడీ పేరుతో తిరిగి నామకరణం చేశారు. మొతేరా స్టేడియానికి ఇంతకుముందు సర్దార్ పటేల్ స్టేడియంగా పేరు ఉండగా.. ఇప్పుడు సర్దార్ పటేల్‌ పేరును స్పోర్ట్స్ కాంప్లెక్స్‌‌కే పరిమితం చేశారు.

ఈ స్టేడియం సీటింగ్ కెపాసిటీ 1.10 లక్షలు కావడం విశేషం. ఇంగ్లండ్‌‌-టీమిండియా మధ్య జరుగుతున్న మూడో టెస్టుకు మొతేరా ఆతిథ్యం ఇస్తోంది. ఈ స్టేడియం ఓపెనింగ్‌‌కు సంబంధించి బుధవారం ఉదయం నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పాల్గొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీసీసీఐ సెక్రటరీ జై షా, స్పోర్ట్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.