
ప్రపంచం నలుమూలల నుండి పాములంటే దాదాపు అందరికీ భయమే.. అల్లంత దూరాన పాము ఉందని తెలిస్తే చాలే.. భయంతో పరుగులు పెడతారు. దానికి వీలైనంత దూరం పరిగెట్టి ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటారు. కానీ, కొందరు పాములను ప్రేమిస్తారు. వాటితో ఆటలాడుతుంటారు. పాములను పెంపుడు జంతువులగా ఇంట్లో తమవారితో పాటుగానే పెంచుకుంటారు. వాటితో కలిసి తింటారు. తిరుగుతారు. నిద్రపోయే సమయంలో కూడా పాములను వదలకుండా చూసుకుంటారు. అయితే, జూ, జంతు ప్రదర్శన శాలలో అనేక రకాల పాములను చూస్తుంటాం.. కానీ, పూర్వకాలం నాటి పాములకు కూడా ప్రత్యేకించి మ్యూజియంలు ఉన్నాయి.
స్టేట్ యూనివర్శిటీ ఇటీవల UM మ్యూజియం ఆఫ్ జువాలజీకి సరీసృపాలు, ఉభయచరాల 45,000 నమూనాలను బహుమతిగా ఇచ్చింది. వాటిలో 30,000 కంటే ఎక్కువ పాములు ఉన్నాయి. ఇప్పుడు UM మ్యూజియంలో 70 వేల పాముల రకాలు ఉన్నాయి. వీటిలో చాలా పాములు మీరు ఎప్పుడూ చూడనివి ఇక్కడ కనిపిస్తాయి. అయితే, ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే.. ఈ పాముల సేకరణ సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండదు.
అమెరికాలోని మిచిగాన్ విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే అతిపెద్ద పాముల సేకరణకు ప్రసిద్ధి. మిచిగాన్ యూనివర్సిటీ స్నేక్ మ్యూజియం అగ్రస్థానానికి చేరుకుంది. ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీ ఇటీవల UM మ్యూజియం ఆఫ్ జువాలజీకి సరీసృపాలు, ఉభయచరాల 45,000 నమూనాలను బహుమతిగా ఇచ్చింది. వాటిలో 30,000 కంటే ఎక్కువ పాములు ఉన్నాయి. ఇప్పుడు UM మ్యూజియంలో 70 వేల పాముల రకాలు ఉన్నాయి. వీటిలో చాలా పాములు మీరు ఎప్పుడూ చూడనివి ఇక్కడ కనిపిస్తాయి.
Hiss-toric first: U-M museum’s 70,000 snake specimens form the world’s largest research collection.
— Global Michigan (@GlobalMichigan) October 16, 2023
Tens of thousands of scientifically priceless reptile & amphibian specimens, including roughly 30,000 snakes preserved in alcohol-filled glass jars.https://t.co/dqpktFY49V pic.twitter.com/8aIB8Mtg1e
న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం, ఈ పాముల సేకరణ సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండదు. దీనిని ప్రపంచం నలుమూలల నుండి శాస్త్రవేత్తలు మాత్రమే ఉపయోగించుకోగలుగుతారు. మ్యూజియంలోని క్యూరేటర్లు మెడిసిన్‌తో నిండిన వందలాది కంటైనర్లలో పాములు, సాలమండర్ల నమూనాలను సేకరించారు. ప్రత్యేక జాడిలో సేకరించిన పాములు సజీవ పాముల వలె కనిపిస్తాయి.
క్యూరేటర్, పరిణామాత్మక జీవశాస్త్రవేత్త డాన్ రాబోవ్స్కీ మాట్లాడుతూ, ..ఇక్కడి పాముల నమూనాలు జీవసంబంధమైన ‘టైమ్ క్యాప్సూల్’ను సూచిస్తాయని చెప్పారు. ఇక్కడ పరిశోధకులు దశాబ్దాల క్రితం జంతువుల జనాభాను వాటి జన్యుశాస్త్రం, వాటి వ్యాధులు, మరిన్నింటిని అర్థం చేసుకోవడానికి అనుకూలంగా ఏర్పాటు చేశారు. జంతువుల జనాభాలో వ్యాధులు ఎలా వ్యాప్తి చెందుతాయి వంటి కాలక్రమేణా విషయాలు ఎలా మారతాయో మనం అర్థం చేసుకోవాలనుకుంటే ఈ బయోలాజికల్ టైమ్ క్యాప్సూల్స్ చాలా ముఖ్యమైన డేటాను అందజేస్తుంది.