స్నాప్​ డ్రాగన్​ 8 జెన్​3 ప్రాసెసర్​తో ఐకూ 12

స్నాప్​ డ్రాగన్​ 8 జెన్​3 ప్రాసెసర్​తో ఐకూ 12

హైదరాబాద్​, వెలుగు :  వివో సబ్​–బ్రాండ్​ ఐకూ తన నాలుగో వార్షికోత్సవం సందర్భంగా ఐకూ 12 ఫోన్​ను లాంచ్​ చేసింది. ఫ్లాగ్​షిప్​ చిప్​సెట్ ​స్నాప్​డ్రాగన్​8 జెన్ ​3, 120 వాట్ల ఫాస్ట్​చార్జింగ్​, వెనుక మూడు 50 ఎంపీ కెమెరాలు,  144 హెజ్​ రీఫ్రెష్​రేటు గల అమోలెడ్​ డిస్​ప్లే, 5000 ఎంఏహెచ్​ బ్యాటరీ ఇందులోని ప్రత్యేకతలు.  

కేవలం 30 నిమిషాల చార్జింగ్​తో బ్యాటరీ పూర్తిగా నిండుతుంది. 12జీబీ వరకు ర్యామ్​, 256 జీబీ వరకు స్టోరేజీ ఉంటాయి.  ధరలు రూ.50 వేల నుంచి మొదలవుతాయి. ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి అమెజాన్​ ద్వారా ఫోన్​ను ఆర్డర్​ చేయవచ్చు.