కేరళలో ‘వన్‌‌ సిటిజన్‌‌.. వన్‌‌ హెల్త్‌‌ రికార్డ్‌‌’ షురూ

కేరళలో ‘వన్‌‌ సిటిజన్‌‌.. వన్‌‌ హెల్త్‌‌ రికార్డ్‌‌’ షురూ
  • ఆన్‌‌లైన్‌‌లో స్టార్ట్‌‌ చేసిన సీఎం విజయన్‌‌
     

తిరువనంతపురం: డిజిటల్‌‌ హెల్త్‌‌ మిషన్‌‌ ప్రాజెక్టును కేరళ సీఎం పినరయి విజయన్‌‌ సోమవారం ప్రారంభించారు. 50 స్టేట్‌‌రన్‌‌ హాస్పిటల్‌‌లో ఈ ప్రోగ్రామ్‌‌ను ఆన్‌‌లైన్‌‌ ద్వారా స్టార్ట్‌‌ చేశారు. ‘వన్‌‌ సిటిజన్‌‌.. వన్‌‌ హెల్త్‌‌ రికార్డ్‌‌’లక్ష్యంగా ఈ ప్రోగ్రామ్‌‌ను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఈ మిషన్‌‌ ద్వారా ప్రతి ఒక్కరికీ ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయిస్తామని, దీంతో అందరీ హెల్త్‌‌ రికార్డులు ఆన్‌‌లైన్‌‌లో ఉంటాయన్నారు. తద్వారా ప్రభుత్వ హాస్పిటల్‌‌లలో ట్రీట్‌‌మెంట్‌‌ ఇచ్చేందుకు ఈజీ అవుతుందని చెప్పారు. అలాగే హాస్పిటళ్లలో ఓపీ పేషెంట్ల రద్దీని కూడా తగ్గించడంతో పాటు ట్రీట్‌‌మెంట్‌‌ ఇచ్చేందుకు డాక్టర్లకు ఈజీగా ఉంటుందన్నారు. ఈ ఎలక్ట్రానిక్‌‌ హెల్త్‌‌ రికార్డు ద్వారా టెలీ మెడిసిన్‌‌, ఆన్‌‌లైన్‌‌ అపాయింట్‌‌మెంట్‌‌ బుకింగ్‌‌ కూడా చేసుకోవచ్చని సీఎం తెలిపారు. అంతేకాకుండా అంటువ్యాధులు, లైఫ్‌‌స్టైల్‌‌ డిసీజెస్‌‌, తల్లీపిల్లల ఆరోగ్య సంరక్షణ కూడా ఈ పథకం కింద ట్రీట్‌‌మెంట్‌‌ ఇస్తారని వివరించారు. ఈ విధానంలో హెల్త్‌‌ వర్కర్లు మీ ఇంటికే వచ్చి కుటుంబ సభ్యుల హెల్త్‌‌ వివరాలను తీసుకుంటారని, తర్వాత వ్యాధులకు సంబంధించి బ్లూప్రింట్‌‌ను తయారు చేస్తారని వెల్లడించారు.