
నిర్భయ దోషుల న్యాయవాది ఏపీ సింగ్ కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నాడంటూ ఆరోపించారు నిర్భయ తల్లి ఆశాదేవి. అంతేకాదు న్యాయం జరగడంలో ఆలస్యానికి కారణమవుతున్నాడన్నారు. దోషుల తరఫు లాయర్‌కు ఇప్పుడిక ఏమీ లేదని… దీంతో కోర్టులను తప్పుదోవ పట్టిస్తూ న్యాయం జరగడంలో ఆలస్యానికి కారణమవుతున్నాడని ఆమె తెలిపారు. నిర్భయ దోషి వినయ్ సింగ్‌కు విశ్రాంతి అవసరం లేదని… ఆ లాయర్‌కు అవసరమని అన్నారు. వినయ్ ఆరోగ్యంగా ఉన్నాడని, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉన్నాడని నిర్భయ తల్లి అన్నారు.