పదేండ్ల పాలనలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలే : ఎమ్మెల్యే వీరేశం

పదేండ్ల పాలనలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలే : ఎమ్మెల్యే వీరేశం

నకిరేకల్,  వెలుగు : బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని ఎమ్మెల్యే వీరేశం అన్నారు. నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నకిరేకల్ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరయ్యాయని చెప్పారు. విడతలవారీగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. అర్హులైన ప్రతిఒక్కరికీ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. 

పేదోడి సొంతింటి కల నెరవేరుస్తాం 

చిట్యాల : పేదోడి సొంతింటి కల నెరవేరుస్తామని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. గురువారం చిట్యాల మండలం వనిపాకల గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలందరికీ సంక్షేమ పథకాలను అందజేస్తామన్నారు. ధర్మారెడ్డి కాలువ మరమ్మతు పనులను త్వరగా పూర్తి చేస్తానని తెలిపారు.