అవసరాల కోసం నేతలు పార్టీ మారుతుంటరు : కేశవరావు

అవసరాల కోసం నేతలు పార్టీ మారుతుంటరు :  కేశవరావు

 న్యూఢిల్లీ, వెలుగు: తమ అవసరాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా నేతలు పార్టీ మారుతూ ఉంటారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు అన్నారు. ఆదివారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్‌‌ఎస్‌ ఎంపీ వెంకటేశ్ నేత పార్టీ మారడంపై స్పందించారు. బీఆర్ఎస్‌లో చాలా కీలకంగా పని చేసిన వెంకటేశ్ పార్టీ మారడం ఆయన వ్యక్తిగతమన్నారు. అయితే బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అనడంతో కొంత కలత చెందానన్నారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని అన్నారు. 

లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు రాముడితో బీజేపీ రాజకీయం చేస్తోందని ఫైర్ అయ్యారు. అయోధ్య రామాలయంపై పార్లమెంట్‌లో తీర్మానం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. తాను నోయిడాలోని రావణుడి గుడికి వెళ్తానన్నారు. అయోధ్య గుడికి వెళ్లని వారు దేశ వ్యతిరేకులు కాదన్నారు. అయోధ్య ఆలయం గురించి మట్లాడిన ప్రధాని.. యాదాద్రి గురించి ఎందుకు మాట్లాడటం లేదని కేశవరావు ప్రశ్నించారు.