కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మాస్వరాజ్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఏఐసీసీ చైర్‌పర్సన్ సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి సంతాపం తెలిపారు. సుష్మా కుటుంబానికి వారు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
