పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సుభాష్నగర్సెంటర్లో మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి(కాకా) విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మహనీయుల ఆశయసాధన సంఘం నాయకులు, కాకా అభిమానులు బుధవారం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. కాకా పెద్దపల్లి పార్లమెంటుకు 4 సార్లు ప్రాతినిధ్యం వహించి బడుగు, బలహీన వర్గాలకు ఎంతో సేవ చేశారని వినతిపత్రంలో పేర్కొన్నారు.
కార్మికులు, పేదల పక్షాన పోరాడిన మహానేత కాకా అని, అలాంటి మహానాయకుడి విగ్రహం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసి గౌరవించుకోవాలని వినతిపత్రంలో కోరారు. కార్యక్రమంలో మహనీయుల ఆశయసాధన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు బొంకూరి కైలాసం, బాలసాని సతీశ్‌గౌడ్, బోడకుంట సతీశ్, ఆరెపల్లి రాహుల్, తిరుపతి, అల్లం సతీశ్, మహేశ్, లక్ష్మారెడ్డి తదితరులున్నారు.
