
బంపర్ మెజారిటీతో లోక్ సభ ఎన్నికల్లో విక్టరీ
పెద్ద సంఖ్యలో ఓటర్లుండే లోక్ సభ సెగ్మెంట్లలో గెలవడమే కష్టం . అలాంటిది కొందరు నాయకులు గెలవడమే కాదు.. తమ విజయాన్ని ఓ రికార్డుగా మార్చుకున్నారు. లక్షలకు లక్షల ఓట్లు సాధించి ప్రత్యర్థులకు అందనంత ఎత్తున నిలిచారు. లక్షా.. రెండులక్షలు కాదు.. ఐదు నుంచి ఆరు లక్షల మెజారిటీతో బంపర్ విక్టరీ కొట్టారు . ఈ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో బీజేపీ సీనియర్ నేత దివంగత గోపీనాథ్ ముండే కుమార్తె ప్రీతమ్ ముండే ఉన్నారు . 2014లో జరిగిన ఉప ఎన్నికల్లో 6.9 లక్షల ఓట్ల మెజారిటీ సాధించారు ప్రీతమ్ ముండే. భారీ మెజారిటీలు సాధించడంలో తెలుగురాష్ట్రాల నేతలు ముందున్నారు. టాప్ 10లో సగంమంది మనోళ్లే ఉన్నారు .
సగం మంది మనోళ్లే
అత్యధిక మెజారిటీ సాధించిన ఎంపీల్లో టాప్ టెన్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు సగంమంది ఉన్నారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహా రావు ఈ లిస్ట్ లో మూడో స్థానంలో నిలిచారు. 1991లోనంద్యాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన బీజేపీ అభ్యర్థి బంగారు లక్ష్మణ్ పై 5.8లక్షలు ఓట్ల మెజారిటీతో విజయ దుందుభి మోగించారు. ఈ లిస్ట్ లో ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2011 కడప లోక్‌సభ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి డీఎల్ రవీం ద్రారెడ్డి పై5.45 లక్షల మెజారిటీ సాధించారు. 2015లో వరంగల్ ఎంపీ స్థానానికి కడియం శ్రీహరి రాజీనామా చేయడంతో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన పసునూరు దయాకర్ కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణపై 4.59 లక్షల రికార్డు మెజారిటీతో గెలిచారు.పసునూరు దయాకర్ ఈ లిస్ట్ లో ఏడో స్థా నంలోనిలిచారు. దివంగత ము ఖ్యమంత్రి వైఎస్ రాజశే-ఖర్ రెడ్డి తొమ్మి దో స్థా నంలో ఉన్నారు . 1991లోకడప నుం చి పోటీ చే సిన ఆయన టీడీపీ అభ్యర్థి సి.రామచంద్రయ్యపై 4,18,925 ఓట్ల మె జారిటీసా ధించారు. సీఎం కేసీఆర్ పదో స్థా నంలోనిలిచారు. 2014లో జరిగిన ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి శ్రవణ్ కు మార్‌రెడ్డి పై 3,97,029 ఓట్ల మె జారిటీతోగెలుపొందారు
.తొమ్మిది ఓట్లతో కొణతాల గెలుపు
ఉమ్మడి ఏపీలో 1989 ఎన్నికల్లో అనకాపల్లి లోక్ సభస్థానం నుం చి పోటీ చేసిన కాం గ్రెస్ అభ్యర్థి కొణతాల రామకృష్ణ తొమ్మిదే ఓట్లతో గెలిచారు. ఆ ఎన్నికల్లో కొణతాలకు 2,99,109 ఓట్లు రాగా, సమీప టీడీపీ అభ్యర్థి అప్పల నర్సింహయ్యకు 2,99,100 ఓట్లు వచ్చాయి. తెలంగాణ వారీగా పరిశీలిస్తే అతి తక్కువ ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎంపీలు చాలా మందే ఉన్నారు . 1962లో కాం గ్రెస్ నుంచి బీ ఏ మీర్జా(వరంగల్) 738 ఓట్ల స్వల్ప మెజారిటీతో గె లిచారు.1967లో కాం గ్రెస్ నేత రమాపతిరావు(కరీం నగర్)2,176 ఓట్లతో ఇండిపెండెంట్ అభ్యర్థి ఈశ్వరయ్య-పై విజయం సాధించారు. 1984లో కాం గ్రెస్ అభ్యర్థి తాడూరు బాలాగౌడ్ (నిజామాబాద్) 2,547 ఓట్లతోటీడీపీ అభ్యర్థి నా రాయణరెడ్డి పై గె లుపొందారు.1952లో పీడీఎఫ్ అభ్యర్థి పెండ్యా ల రాఘవరావు(వ-రంగల్) 3,613 ఓట్ల మె జారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి కాళోజీ నారాయణరావుపై గెలిచారు. 1977లోకాం గ్రెస్ నేత ఎంఎం హషీం(సికిం ద్రాబాద్) 3,847ఓట్లతో బీ ఎల్డీ అభ్యర్థి టీఎస్ కాం తంపై గె లిచారు.
ఫస్ట్ ప్లేస్‌లో ప్రీతమ్ ముండే
2014లో మహారాష్ట్రలోని బీ డ్ నుం చి బీ జేపీ అభ్యర్థిగా గోపీనాథ్ ముండే కు మార్తె ప్రీతమ్ ముండే..కాం గ్రెస్ క ్యాండిడేట్ అశోక్‌రావుపై 6,96,321 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ప్రీతమ్‌కు 9,22,416 ఓట్లు రాగా, అశోక్ రావుకు 2,26,095 ఓట్లు వచ్చాయి. ప్రీతమ్ తర్వాత అత్యధికమెజారిటీ రికార్డు సీపీఎం ఎంపీ అనిల్ బసు పేరిట ఉంది. అనిల్ బసు 2004లో బెంగాల్‌లోని ఆరాం బాగ్ సె గ్మెం ట్ లో బీ జేపీ అభ్యర్థిపై 5,92,502 ఓట్ల తేడాతో గె లిచారు. 2014లో వడోదరలోపోటీ చే సిన మోడీ 5.70 లక్షల ఓట్లు సాధించి గె లిచారు.