ఇంటి నుంచే పరిపాలిస్తున్నలీడర్లు వీళ్లే..

ఇంటి నుంచే పరిపాలిస్తున్నలీడర్లు వీళ్లే..

మామూలు జనం, ఆఫీసర్లు మాత్రమే కాదు.. దేశాలను నడిపించే నాయకులనూ కరోనావైరస్ పట్టి పీడిస్తోంది. పలు దేశాల మంత్రులు, అధ్యక్షులకూ కొవిడ్–19 కన్ఫమ్ అయింది. మరికొందరు కరోనా టెస్టుల రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. మొత్తంమీద కన్ఫమ్ అయినవారు, కరోనా లక్షణాలు ఉన్నవారు, అసలు ఏ లక్షణాలు లేకపోయినా, అనుమానం ఉన్నవారంతా ఇండ్లకే పరిమితమైపోయారు. సెల్ఫ్​క్వారెంటైన్‌‌‌‌‌‌‌‌లో ఉంటూనే పాలనా వ్యవహారాలు కొనసాగిస్తున్నారు.

‘వర్క్ ఫ్రం హోం’ లీడర్లు వీళ్లే..

జస్టిన్ ట్రూడో (కెనడా ప్రధాని): ట్రూడూ భార్య సోఫీ గ్రెగోయిర్​కు కరోనావైరస్ పాజిటివ్‌‌‌‌‌‌‌‌గా వచ్చింది. దీంతో ట్రూడూ ఇప్పుడు సెల్ఫ్​ఐసోలేషన్ లో ఉంటూనే దేశాన్ని పాలిస్తున్నారు.

డేవిడ్ ససోలీ (యూరోపియన్ పార్లమెంట్ ప్రెసిడెంట్): డేవిడ్ ఇటీల ఇటలీ వెళ్లొచ్చారు. దీంతో ముందు జాగ్రత్తగా రెండు వారాల పాటు సెల్ఫ్​ఐసోలేషన్‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లారు. మంగళవారం బ్రస్సెల్స్ లో జరిగిన యూరోపియన్ యూనియన్ మీటింగ్ కు కూడా ఆయన ఇంటి నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధ్యక్షత వహించారు.

జైర్‌‌‌‌‌‌‌‌ బోసనారో (బ్రెజిల్ ప్రెసిడెంట్): బోసనారో ప్రెస్ సెక్రటరీ ఫాబియో వనగార్టెన్​కు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో బోసనారో కూడా తన శాంపిల్‌‌‌‌‌‌‌‌ను టెస్టులకు పంపారు. పాజిటివ్​ వచ్చింది. ఇంటి నుంచే పాలిస్తున్నారు.

డొనాల్డ్ ట్రంప్ (అమెరికా ప్రెసిడెంట్): వనగార్టెన్ ఇటీవల ట్రంప్​ను కలిశారు. ఆమెకు కరోనా పాజిటివ్​గా తేలడంతో ట్రంప్ ఆందోళనలో పడ్డారు. అమెరికాలో మరో 9 మంది చట్టసభ సభ్యులూ కరోనా భయంతో సెల్ఫ్​క్వారెంటైన్ లో ఉంటున్నారు.

డాక్టర్ అలీ అక్బర్ వెలాయటీ(ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా ఖమేనీకి సలహాదారు): ఈయనకు ఇటీవలే కరోనావైరస్ పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం టెహ్రాన్ లోని తన ఇంట్లో క్వారెంటైన్ అయ్యారు. ఖమేనీ మాజీ సలహాదారు ఒకరు ఇటీవలే కొవిడ్–19తో చనిపోయారు. ఇరాన్ పార్లమెంటులో ఏకంగా 23 మంది సభ్యులకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఇద్దరు చనిపోయారు. చాలా మంది లీడర్లకూ పాజిటివ్ వచ్చింది.

ఫ్రాంక్ రీస్టర్(ఫ్రాన్స్ కల్చరల్ మినిస్టర్): మంత్రి రీస్టర్ తో పాటు పలువురు ఎంపీలకు కరోనా సోకినట్లు వార్తలు వచ్చాయి.

నదీన్ డోరిస్ (బ్రిటన్ జూనియర్ హెల్త్ మినిస్టర్): డోరిస్ కు కరోనా పాజిటివ్‌‌‌‌‌‌‌‌గా రిపోర్ట్ వచ్చింది. ఈ టెస్టుకు ముందే ప్రధాని బోరిస్ జాన్సన్ తో ఆమె భేటీ అయ్యారు.

ఖల్తమాగిన్ బటుల్గా (మంగోలియా ప్రెసిడెంట్): బటుల్గాతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఇటీవల చైనా వెళ్లొచ్చారు. అందుకే బుటుల్గాకు కరోనా నెగెటివ్ అని తేలినా, రెండు వారాల పాటు క్వారెంటైన్ లోకి వెళ్లారు.