ఈ-రూపాయి గురించి తెలుసుకుని, పండ్లు కొన్నా : ఆనంద్ మహీంద్రా

ఈ-రూపాయి గురించి తెలుసుకుని, పండ్లు కొన్నా : ఆనంద్ మహీంద్రా

ఈ-రూపాయి గురించి తెలుసుకున్నానని, వెంటనే దాంతో పండ్లను కొనుగోలు చేశానని ఆనంద్ మహీంద్రా చెప్పారు. ఈ లావాదేవీకి సంబంధించిన వీడియోను ట్విట్టర్​ ద్వారా షేర్ చేశారు. "ఈరోజు (బుధవారం) జరిగిన రిజర్వ్ బ్యాంక్ బోర్డు మీటింగ్‌‌‌‌లో నేను ఆర్​బీఐ డిజిటల్ కరెన్సీ ఈ-రూపాయి గురించి తెలుసుకున్నాను. సమావేశం ముగిసిన వెంటనే,  సమీపంలోని పండ్ల అమ్మకందారు బచ్చే లాల్ సహానీకి దగ్గరికి వెళ్లాను. దీన్ని అంగీకరించిన మొదటి వ్యాపారి ఆయనే! క్యూఆర్​ కోడ్​ ద్వారా డిజిటల్ రూపాయలు తీసుకొని దానిమ్మపండ్లు ఇచ్చారు”అని ఆయన పేర్కొన్నారు.