రబ్బర్ బాల్స్‌‌‌‌తో స్కూప్‌‌ షాట్లు నేర్చుకున్న: సూర్య కుమార్

రబ్బర్ బాల్స్‌‌‌‌తో స్కూప్‌‌ షాట్లు నేర్చుకున్న: సూర్య కుమార్

మెల్‌‌‌‌బోర్న్: ఇండియా బ్యాటర్‌‌ సూర్యకుమార్‌‌ యాదవ్‌‌ తన మాస్టర్‌‌ స్ట్రోక్స్‌‌తో టీ 20 వరల్డ్‌‌కప్‌‌లో ఫ్యాన్స్‌‌ను అలరిస్తున్నాడు. ముఖ్యంగా తను కొట్టే స్కూప్‌‌ షాట్లు చూసి అంతా ఫిదా అవుతున్నారు. గత మ్యాచ్‌‌లో జింబాబ్వే పేసర్‌‌ రిచర్డ్‌‌ ఎంగరావ బౌలింగ్‌‌లో కొట్టిన  స్కూప్‌‌ షాట్‌‌  ఇప్పుడు టాక్‌‌ ఆఫ్ ది టౌన్‌‌ అయ్యింది. చిన్నప్పుడు రబ్బర్‌‌ బాల్‌‌తో ఆడేటప్పుడే స్కూప్‌‌ షాట్లు కొట్టడంలో మాస్టర్‌‌ అయ్యానని సూర్య తెలిపాడు.

‘ఇలాంటి షాట్లు ఆడేప్పుడు బౌలర్‌‌ ఎలాంటి బాల్‌‌ వేస్తున్నాడో, తను ఏం ఆలోచిస్తున్నాడో పసిగట్టాలి. ఫీల్డర్లు ఎక్కడున్నారు.. బౌండరీ లైన్‌‌ ఎంత దూరంలో ఉందో చూసుకోవాలి.  ఆసీస్‌‌లో గ్రౌండ్స్‌‌ 80–85 మీటర్లు ఉంటాయి. స్క్వేర్‌‌ బౌండ్రీ కూడా 75–80 మీటర్ల దూరం ఉంటుంది. అదే వికెట్ల వెనకాల అయితే 60–65 మీటర్లే ఉంటుంది. కాబట్టి నేను ఆ దిశగానే షాట్లు ట్రై చేసి సక్సెస్‌‌ అవుతున్నా. చిన్నప్పుడు నేను రబ్బర్‌‌ బాల్‌‌ క్రికెట్‌‌ ఆడేవాడిని. నా దోస్తు తడి బంతితో 17–-18 గజాల నుంచి ఫాస్ట్‌‌గా బౌలింగ్‌‌ చేసేవాడు. అప్పుడే ఈ షాట్లు ఆడటం నేర్చుకున్నాను. అంతే తప్ప వీటి కోసం స్పెషల్‌‌గా నెట్స్‌‌లో ప్రాక్టీస్‌‌ చేయను’ అని బీసీసీఐ టీవీ కోసం అశ్విన్‌‌ చేసిన ఇంటర్వ్యూలో సూర్య వెల్లడించాడు.