
గద్వాల, వెలుగు: ధరూర్ మండలంలోని కొత్తపల్లి శివారులో సంచరిస్తున్న హైనా.. చిరుత పులి అని రైతులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం రాత్రి గ్రామానికి చెందిన వెంకటేశ్ పశువుల పాకపై గుర్తు తెలియని జంతువు దాడి చేసి, ఆవును చంపేసింది. గురువారం రాత్రి అదే పాకలోని ఆవుదూడను హతమార్చింది. శుక్రవారం పాదముద్రలను పరిశీలించిన ఫారెస్ట్ ఆఫీసర్ పర్వేజ్ అహ్మద్ చిరుత పులి అడుగుల మాదిరిగానే ఉన్నాయని తెలిపారు.
నిఘా కోసం సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. చిరుత పులి అయితే గొంతు దగ్గరదాడి చేస్తుంద ని చెప్పారు. ఆవు, దూడ కడుపు చీల్చడాన్ని బట్టి చూస్తే హైనా కూడా అవ్వొచ్చని పేర్కొన్నారు.10 రోజుల పాటు వ్యవసాయ పొలాల వద్ద పశువులను కట్టేయ వద్దని గ్రామస్తులకు సూచించారు. చనిపో యిన జీవాలకు సంబంధించి పరిహారం కోసం ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని తెలిపారు. రాత్రిళ్లు ఏవైనా జంతువులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని, వాటికి ఎలాంటి హాని త లపెట్టవద్దని చెప్పారు.