లక్షితను బలిగొన్న చిరుత .. ఇంకా తిరుమల కొండల్లోనే..!

 లక్షితను బలిగొన్న చిరుత ..  ఇంకా తిరుమల కొండల్లోనే..!

తిరుమలలో చిన్నారి లక్షితను బలిగొన్న చిరుత ఇంకా తిరుమల కొండల్లోనే ఉందని తెలుస్తోంది. ఇప్పటివరకు  అటవీశాఖ అధికారులు బోన్లు ఏర్పాటు చేసి నాలుగు చిరుతలను  పట్టుకున్నారు. అయితే ఇందులో రెండు మనుషుల్ని తినేవి(మ్యాన్‌ఈటర్లు) కావని డీఉఎన్ఏ పరిక్షల్లో తేలడంతో  శ్రీవేంకటేశ్వర జూపార్కులో ఉన్న ఆ రెండింటిని శ్రీశైలం అడవుల్లో విడిచిపెట్టారు. 

మిగిలిన రెండింటినీ జూపార్కులోనే ఉంచారు. మిగిలిన రెండింటినీ జూపార్కులోనే ఉంచారు. వీటి డీఎన్‌ఏ రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉంది. ఈ రెండు చిరుతల్లో ఒకదానికి పూర్తిగా దంతాలు లేవని, రెండోది పదిహేను  నెలల పసికూన అని చెబుతున్నారు. సో ఇవి కూడా మ్యాన్‌ఈటర్లుగా తేలే అవకాశం ఉందంటున్నారు. దీంతో లక్షితను చంపిప చిరుత ఇంకా తిరుమలలోనే ఉన్నట్లుగా అనుమానలు వ్యక్తం అవుతున్నాయి.  

ALSO READ:  చిన్నారులపై వీధి కుక్కల దాడి

తిరుమల అలిపిరి కాలిబాట  మార్గంలో బాలుడిపై చిరుత దాడి చేసిన తరువాత టీటీడీ అధికారులు అడవిలో బోన్లు ఏర్పాటు చేసి ఓ  చిరుతను బంధించారు.  ఆ తరువాత కొన్నిరోజులకు దానికి ఎలాంటి  పరీక్షలు చేయకుండా అటవీ ప్రాంతంలో వదలిపెట్టారు. ఆ తర్వాత నెలరోజుల్లోనే అలిపిరి కాలిబాటలో లక్షితపై చిరుత దాడి చేసి, చంపింది. 

దీంతో బాలుడిపై ఎటాక్ చేసిన  చిరుతనే లక్షితపై కూడా దాడికి పాల్పడిందా అన్న అనుమానలు వ్యక్తం అవుతున్నాయి.  ఒక్కసారి మనిషి రక్తానికి అలవాటు పడితే ఆ జంతువు వరుసదాడులు చేస్తుందని అటవీశాఖే తేల్చింది.