సింగిల్ డ్రీమ్ 6 ఇయర్స్

సింగిల్ డ్రీమ్ 6 ఇయర్స్

సివిల్స్ ఏడో ర్యాంకర్ వరుణ్ రెడ్డి

సివిల్స్ ఇంటర్వ్యూలో బోర్డు మెంబర్లు నన్ను 30 ప్రశ్నలు అడిగారు… ఐఐటీ ఇంజనీర్స్ తో సొసైటీకి ఏంప్రయోజనం.. వాళ్లంతా అబ్రాడ్ వెళ్తున్నారు కదా.. అనేది మొదటి ప్రశ్న. ‘ఐఐటీ ఇంజనీర్లతో దేశంలో ఆర్థిక వ్యవస్థ పటిష్టమవుతుంది. ఇండియన్ ఇంజనీర్లు విదేశాలకు వెళ్లి.. అక్కడ వారి టాలెంట్ , వాళ్ల స్కిల్స్‌, సత్తా చూపిస్తున్నారు. అందుకే విదేశాల్లో ఉన్న ప్రముఖ ఐటీ కంపెనీలు మన వైపు చూస్తున్నాయి. వాళ్ల కంపెనీలను మన దేశంలో ఏర్పాటు చేస్తున్నారు. ఐటీ కంపెనీల ఏర్పాటు, ఇతర అనుబంధ రంగాలతో ఆదాయం పెరుగుతుంది..’అని సమాధానం చెప్పాను. ‘మేక్ ఇన్ ఇండియా’.. ఎలాతయారవుతుంది… అని రెండో ప్రశ్న వేశారు. కాన్ఫిడెన్స్ తో ఆన్సర్ చేసిన. ఇంజనీరింగ్ లో నేను చేసిన ప్రాజెక్టులు, పేటెంట్ లు అందుకున్న వర్క్ లపై ప్రశ్నలేశారు. అన్నింటికీ సమాధానమిచ్చాను.

నీ హాబీ ట్రావెల్స్.. కదా ఎక్కడికి వెళ్లారు. నీ ఫేవరేట్ ప్లేస్ ఏంటీ, ట్రావెలింగ్ లో ఏం నేర్చుకున్నారు.. అంటూ ప్రశ్నలు వేశారు. నల్లగొండ జిల్లా మిర్యా లగూడ మండలం అవంతీపురం శ్రీ ప్రకాశ్ స్కూల్లో ఆరో తరగతి వరకు చదువుకున్న. కృష్ణా జిల్లా గుడివాడలో హైస్కూల్, గూడవల్లి కేకేఆర్ కాలేజీలో ఇంటర్ , ముంబై ఐఐటీలో ఇంజినీరింగ్ కంప్యూటర్ సైన్స్ .ఐఐటీ ఎంట్రన్స్ లో ఆలిండియా స్థాయిలో అప్పు డు 2 9 వ ర్యాంకొచ్చింది. అమ్మ నాగమణి అగ్రికల్చర్ ఆఫీసర్ . నాన్న జనార్ధన్ రెడ్డి డాక్టర్. వాళ్లిద్దరు ప్రజలకు తమ సేవలందించటం.. తిరిగి ప్రజల అభిమానం అందుకోవటం.. నాకు ఇన్ స్పిరేషన్ . బీటెక్ లో ఉన్నప్పుడే ఐఏఎస్ కావాలని టార్గెట్ పెట్టుకున్న.

రోజులో 12 గంటలు చదువే…

సివిల్స్ సాధించాలన్నదే నా గోల్ . ఇంకో లక్ష్యం లేదు. సివిల్స్ లో నేను మ్యాథ్స్ తీసుకున్న. సిలబస్ కంప్ లీట్ చేసేందుకు వీక్లీ టార్గెట్స్ పెట్టుకొని ప్రిపేరైన. ప్రతి రోజు 10 గంటల నుంచి 12 గంటలు చదివేటోణ్ని. ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ తో గ్రూప్ డిస్కషన్ చేసేటోణ్ని. పాలిటిక్స్ కు లక్ష్మీకాంతం, ఎన్విరాన్ మెంట్ కు శంకరయ్య, హిస్టరీ, జాగ్రఫీకి ఎన్ సీఈఆర్టీ, ఎకానమిక్స్ కు శ్రీరాం ఐఏఎస్ మెటీరియల్ ఉపయోగపడింది. కరెంట్ అఫైర్స్ కు న్యూస్ పేపర్స్ చదివిన. నాగ్ పూ ర్ లో ఐఆర్ఎస్ శిక్షణలో ఉండగానే,సివిల్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్లిన.

చదువే కాదు రిలాక్స్​ ఇంపార్టెంట్ …

నాకు క్రికెట్, లాంగ్ టెన్నిస్ ఇష్టమైన ఆటలు. ప్రిపరేషన్ టైంలో అప్పడప్పుడు క్రికెట్ ఆడి రిలాక్స్ అయ్యాను. ట్రావెలింగ్, రీడింగ్ బుక్స్ నా హాబీలు.

ఆరేళ్లు పట్టువీడకుండా ప్రయత్నించాడు…

నా పెద్ద కుమారుడు వరుణ్ రెడ్డి ఐఏఎస్ సాధించటం చెప్పలేనంత ఆనందంగా, గర్వంగా ఉంది. మొదటి రెండు సార్లు ఇంటర్వ్యూ,మెయిన్స్ వరకు వెళ్లాడు. ఐఆర్ఎస్ లో ర్యాంకులు వచ్చిన ఐఏఎస్ గోల్ రీచ్ కాలేదన్నది ఉన్నది. ఐఆర్ ఎస్ లో ఉండగానే ప్రణాళిక ప్రకారం ఐఏఎస్ కు ప్రిపేర్ అయ్యి విజయం సాధిం చాడు. ఐఏఎస్ సాధించటం వెనుక పట్టుదలతో పాటు ప్లానింగ్ ఉంది. చిన్నకుమారుడు పృథ్వీరెడ్డి వరంగల్ కాకతీయ యూనివర్సి టీలో ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్నరు. ఆటలు. ప్రిపరేషన్ టైంలో అప్పడప్పుడు క్రికెట్ ఆడి రిలాక్స్ అయ్యాను. ట్రావెలింగ్, రీడింగ్ బుక్స్ నా హాబీలు.