నిద్ర తగ్గుతోందా.. ఈ వార్త మీ కోసమే..!

నిద్ర తగ్గుతోందా.. ఈ వార్త మీ కోసమే..!

ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరికి 8 గంటలు నిద్ర పోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ప్రతిరోజు ఎనిమిది గంటలు నిద్రపోతేనే శారీరకంగా, మానసికంగా ఫిట్ గా ఉంటారని మానసిక నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు సరైన నిద్ర లేకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.

నిద్రలేమి సమస్య వయసుతో పాటు స్త్రీ, పురుషుల్లో భిన్నంగా ఉంటుందని ఓ సర్వేలో తేలింది. లేట్ నైట్ పార్టీస్, ఫేస్ బుక్, వాట్సాప్ లో చాటింగ్ చేస్తూ ఆలస్యంగా పడుకుంటున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. 30 శాతం మంది రాత్రి త్వరగా నిద్రపోతున్నారని, 30 శాతం మంది ఆలస్యంగా నిద్రపోతున్నారని, మరో 40 శాతం మంది ఈ రెండిటికి మధ్యలో కాస్త అటుఇటుగా నిద్రపోతున్నట్లు తేలింది.

బాగా చదువుకొని మంచిగా స్థిరపడాలనే పేరేంట్స్ ఆశతో నిద్రకు దూరం అవుతున్నామని చెబుతున్నారు విద్యార్థులు. ర్యాంకులు, మార్కుల కోసం పేరేంట్స్ పిల్లలను కార్పొరేట్ స్కూల్స్, కాలేజీల్లో చేర్పించడంతో సరిగా నిద్రపోక అనారోగ్యాలకు గురవుతున్నారని చెబుతున్నారు.

బిజీ లైఫ్ లో టెన్షన్ తో సరిగా నిద్రపోవడం లేదంటున్నారు పబ్లిక్. పిల్లలు పుట్టినప్పటి నుంచి ప్రయోజకులు అయ్యేవరకు వారి గురించి ఆలోచించి టెన్షన్ పడాల్సి వస్తుందంటున్నారు. ఇంటి సమస్యలతో నిద్రరాక అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు.

సరిపడేంత నిద్రలేకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు డాక్టర్లు. నిద్రలేమితో మధుమేహం, బీపీ, గుండె సంబంధిత వ్యాధులు, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయంటున్నారు. కొన్ని ఆహార నియమాలు పాటిస్తే రాత్రి ఈజీగా నిద్ర పడుతుందంటున్నారు.

రోజు బ్యాలెన్స్ ఫుడ్ తీసుకుంటూ ఎక్సర్ సైజ్ తో పాటు యోగా చేస్తే నిద్రపట్టడంతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుందని సూచిస్తున్నారు డాక్టర్లు.