కాలుష్యం పెరగొద్దంటే.. ఆఫీసులకు నడుచుకుంటూ వెళ్లండి 

కాలుష్యం పెరగొద్దంటే.. ఆఫీసులకు నడుచుకుంటూ వెళ్లండి 

కోయంబత్తూర్: దీపావళికి క్రాకర్స్ కాల్చడంపై ప్రతిఏటా పెద్ద చర్చే నడుస్తుంది. టపాసులు కాల్చొద్దని కొందరు అంటుంటే.. కాలిస్తే తప్పేంటని ఇంకొందరు సోషల్ మీడియాతోపాటు టెలివిజన్లలోనూ వాదిస్తుంటారు. క్రాకర్స్ కాల్చడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతోందని కొందరు వాదిస్తే.. పెళ్లిళ్లు, ఇతర పండుగలు, న్యూ ఇయర్ లాంటి వేడుకలకు కాల్చినప్పుడు లేనిది దీపావళికి పేలిస్తే తప్పేంటని మరికొందరు అంటూంటారు. ఈ నేపథ్యంలో దీపావళి సెలబ్రేషన్స్‌పై ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీవాసుదేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాయు కాలుష్యాన్ని కారణంగా చూపి పిల్లల్ని క్రాకర్స్ కాల్చకుండా ఆపొద్దని సద్గురు అన్నారు. టపాకాయలను బ్యాన్ చేయొద్దని విజ్ఞప్తి చేశారు. 

‘గత కొన్నేళ్లుగా నేను క్రాకర్స్ కాల్చట్లేదు. కానీ నా చిన్నతనంలో బాగా పేల్చేవాడ్ని. సెప్టెంబర్ నెల నుంచే టపాసుల గురించి ఆలోచించేవాళ్లం. దివాళీ ముగిశాక కూడా మిగిలిన క్రాకర్స్‌ను ఒకట్రెండు నెలలు వరకు కాలుస్తుండేవాళ్లం. పిల్లల్ని టపాసులకు దూరంగా ఉంచడం సరికాదు. వాతావరణ కాలుష్యం గురించి ఆందోళన చెందేవారు చిన్నారుల సంతోషం కోసం క్రాకర్స్ కాల్చడం మానేయండి. అలాగే మూడ్రోజులు మీరు పని చేసే ఆఫీసులకు నడుచుకుంటూ వెళ్లండి. క్రాకర్స్ కాలిస్తే వచ్చే సంతోషం నుంచి పిల్లల్ని దూరం చేయకండి’ అని సద్గురు కోరారు.  

మరిన్నివార్తల కోసం:

వరల్డ్ రికార్డుకు అయోధ్య రెడీ

నాపై అర్ధరాత్రి కుట్ర చేశారు: కెప్టెన్

రూ.100తో ఆర్టీసీ బస్సులో రోజంతా ప్రయాణం