బిజినెస్​ చేద్దాం.. రెడీనా?

బిజినెస్​ చేద్దాం.. రెడీనా?

బిజినెస్​ చేద్దాం.. రెడీనా?
ఇండియావైపు రష్యా కంపెనీల చూపు
రష్యాలోఈయూ, యూఎస్​ బ్రాండ్లు బంద్​

న్యూఢిల్లీ :  ఉక్రెయిన్​తో యుద్ధం చేస్తున్న కారణంగా యూరప్​సహా చాలా దేశాలు రష్యాతో వ్యాపార సంబంధాలను తెంచుకున్నాయి. తమ బ్రాండ్లను అమ్మడం లేదు. కొన్ని కంపెనీలు అయితే ఆపరేషన్స్​ను పూర్తిగా నిలిపివేశాయి. దీంతో చాలా వస్తువులకు కొరత ఏర్పడింది. రష్యాతో మన దేశానికి మంచి దోస్తీ ఉంది. అందుకే అక్కడి కంపెనీలు బిజినెస్​ కోసం ఇండియావైపు చూస్తున్నాయి. రష్యా  ఈ–-కామర్స్ ప్లాట్‌‌‌‌ఫారమ్‌‌‌‌లు ఓజోన్,  యాండెక్స్ మార్కెట్, ఫుడ్ సప్లిమెంట్స్ సంస్థ ఫార్మ్‌‌‌‌స్టాండర్డ్, డెంటల్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్ సిమ్‌‌‌‌కోడెంట్, అతిపెద్ద ఫుడ్ రిటైలర్ ఎక్స్​5 రిటైల్ గ్రూప్,  కాన్ఫెక్షనరీ మేజర్ యూనికాన్ఫ్​ వంటివి వ్యాపార ఒప్పందాల కోసం ఇండియాతో చర్చిస్తున్నాయి. రష్యాపై రిస్ట్రిక్షన్ల  కారణంగా యూరోపియన్,  అమెరికన్ బ్రాండ్‌‌‌‌లు ఆ దేశానికి కన్జూమర్​ ఎలక్ట్రానిక్స్,  దుస్తులతో సహా చాలా వస్తువులను సరఫరా చేయడం మానేశాయి. ఇదే దేశానికి చెందిన యాండెక్స్​ మార్కెట్​.. దిగుమతులు, లాజిస్టిక్స్, కస్టమ్స్ క్లియరెన్స్, స్టోరేజీ, డిస్ట్రిబ్యూషన్​ బిజినెస్​లు​ చేస్తుంది. దుస్తులు  ఫ్యాషన్, పిల్లల బొమ్మలు, బెడ్ లినెన్, హోమ్​ డెకర్​, వస్త్రాలు,  ఎలక్ట్రానిక్స్, వంటగది వస్తువులు, టీ,  తోలు వంటి వాటిని ఇండియా నుంచి కొనేందుకు అవకాశాలను వెతుకుతోంది. డ్రింక్స్​, సీఫుడ్, టీ, కాఫీ, చికోరీ, రైస్, క్యాన్డ్ ఫుడ్, కిచెన్‌‌‌‌వేర్,    ద్రాక్ష వంటి వాటి కొనుగోలు కోసం ఇండియా సప్లైయర్స్​తో కలసి పనిచేస్తామని రష్యా ఫుడ్​ రిటైలర్​ ఎక్స్​5 తెలిపింది. ఇందుకోసం ఎక్స్​5 గ్రూప్  ప్రతినిధులు ఏప్రిల్ చివరి వారంలో మనదేశానికి వస్తారు. ప్రస్తుతం ఎక్స్​5 ప్రపంచవ్యాప్తంగా 60 కంటే ఎక్కువ దేశాల నుంచి వస్తువులను కొనుగోలు చేస్తోంది.   ఎక్స్​5 గ్రూప్ ఇంపోర్ట్​ వాల్యూమ్‌‌‌‌ల పరంగా ఇండియా టాప్ 20 దేశాలలో ఒకటి. లాభదాయకమైన భారతీయ వస్తువుల సరఫరాను సమీప భవిష్యత్తులో పెంచాలని ప్లాన్ చేస్తున్నామని కంపెనీ ఎగ్జిక్యూటివ్​ ఒకరు చెప్పారు. 
బకాయిలు ఇంకా రాలేదు రష్యా కంపెనీలు ఇండియాతో మాట్లాడుతున్నది నిజమే అయినా, పేమెంట్స్ సమస్యపై రెండువైపులా ఆందోళన ఉందని సంబంధిత ఆఫీసర్​ ఒకరు చెప్పారు. యుద్ధం వలన ఏర్పడిన  సమస్యలతో  ఇండియా ఎక్స్​పోర్టర్లకు రష్యా నుంచి 200 మిలియన్​ డాలర్ల విలువైన బకాయిలు రావాల్సి ఉంది. ఇలాంటి ఎగుమతిదారుల వివరాలను ఇటీవల కేంద్ర కామర్స్​, ఇండస్ట్రీ మినిస్ట్రీ తీసుకుంది. ఇక నుంచి ఇండియా బ్రాండ్లను తన ప్లాట్​ఫారమ్​ ద్వారా అమ్మేందుకు ఒజోన్​ రెడీ అయింది. కమీషన్​ పద్ధతిలో ఇండియన్​ వస్తువులను ఇది ఆన్​లైన్​లో అమ్ముతుంది. వ్యవసాయానికి సంబంధించిన కొన్ని ప్రొడక్టులపై యూనికాంఫ్​ఆసక్తి చూపిస్తోంది. ఇది రష్యా కాన్ఫెక్షనరీ మార్కెట్లో లీడర్​కూడా. ఫార్మాస్యూటికల్స్, మెడికల్​ డివైజ్​లు, ఎక్విప్​మెంట్ల కోసం కనీసం ఐదు రష్యా కంపెనీలు భారతదేశం నుండి సప్లైల గురించి ఆరా తీస్తున్నాయని మరొక ఇండస్ట్రీ ప్రతినిధి ఒకరు చెప్పారు. వీటిలో కొన్ని కంపెనీలకు సప్లైలు అవసరం కాగా, మరికొన్ని డిస్ట్రిబ్యూషన్​లో ఒప్పందం కోసం చూస్తున్నాయి. మాస్కోలోని ఒక సెల్లర్​ భారతదేశం నుండి పాలిస్టర్ నూలును కొనుగోలు చేయడానికి ఆసక్తిని కనబరుస్తున్నారని తెలుస్తోంది.  జర్మనీ, చైనా, టర్కీ , ఇటలీలోని సప్లైయర్లపై  ఆధారపడటాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు టెక్స్‌‌‌‌టైల్ పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇండియాతో బిజినెస్​కు సంబంధించి కొన్ని  ఇతర రష్యా కంపెనీలకు పంపిన ఈ–మెయిల్‌‌‌‌లకు సమాధానం లేదు.

మరిన్ని వార్తల కోసం..

ఎలక్ట్రిక్ బండ్లు పేలుతున్నయ్

మిలటరీ ఖర్చులో మూడో స్థానంలో ఇండియా