
న్యూఢిల్లీ: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) సోమవారం ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా తమిళనాడు న్యూస్‌ప్రింట్ అండ్ పేపర్స్‌లో 0.58 శాతం వాటాను విక్రయించింది. ఎన్‌ఎస్‌ఈ బల్క్ డీల్స్ డేటా ప్రకారం, షేరు ధర రూ.171 వద్ద 4 లక్షల షేర్లను అమ్మింది. ఈ ఏడాది జూన్ క్వార్టర్ ముగిసేనాటికి , తమిళనాడు న్యూస్‌ప్రింట్‌లో ఎల్‌ఐసీ వాటా 1.8శాతం (12.46 లక్షల షేర్లు) గా ఉంది. ఇందులో కొంత భాగాన్ని తాజాగా సేల్ చేసింది. ఇక ప్రభుత్వం వర్జిన్ మల్టీ లేయర్ పేపర్ బోర్డ్ (వీఎంపీబీ) దిగుమతులపై కనీస దిగుమతి ధర విధించడంతో పేపర్ స్టాక్స్‌పై కొనుగోలు ఆసక్తి పెరిగింది. వీఎంపీబీని ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, ఫుడ్ , ఎలక్ట్రానిక్స్, లిక్కర్, పబ్లిషింగ్ వంటి రంగాల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఎల్‌ఐసీ వాటా అమ్మినప్పటికీ తమిళనాడు న్యూస్‌ప్రింట్ షేరు సోమవారం 10.57శాతం పెరిగి రూ.169.77 వద్ద ముగిసింది.