ఎల్ఐసీ పాలసీ హోల్డర్లకు అద్భుత అవకాశం

ఎల్ఐసీ పాలసీ హోల్డర్లకు అద్భుత అవకాశం

ముంబై: గతంలో ల్యాప్సయిన పాలసీలను రివైవ్​ చేసుకోమంటూ కస్టమర్లకు లైఫ్​ ఇన్సూరెన్స్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా (ఎల్‌‌‌‌‌‌‌‌ఐసీ) అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక క్యాంపెయిన్​ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పాలసీ టర్మ్​ పూర్తి కాని, ల్యాప్సయిన పాలసీలను ఈ గడువులో రివైవ్​ చేసుకోమని కస్టమర్లకు సూచిస్తోంది. ఈ నెల 7 నుంచి మార్చి 25 దాకా ఇందుకోసం గడువు ఇస్తున్నట్లు పేర్కొంది. కొవిడ్​–19 తో ఇన్సూరెన్స్​ విలువ మరింత పెరిగిన నేపథ్యంలో పాలసీ హోల్డర్లకు మరో అవకాశం ఇవ్వాలనుకుంటున్నట్లు ఎల్​ఐసీ వివరించింది. జీవితానికి భద్రత కల్పించుకోవడానికి, కుటుంబ ఫైనాన్షియల్​ సెక్యూరిటీకి ఈ చర్య సాయపడుతుందని భావిస్తున్నట్లు ఎల్‌‌‌‌‌‌‌‌ఐసీ తెలిపింది. లేట్​ ఫీలో కన్సెషన్​ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే చెల్లించిన టోటల్​ ప్రీమియం ఆధారంగా ఈ కన్సెషన్​ ఉంటుందని వివరించింది. మెడికల్​ రిక్వైర్​మెంట్లకు ఎలాంటి కన్సెషన్లూ ఉండవని, హెల్త్​, మైక్రో ఇన్సూరెన్స్​ ప్లాన్లకూ లేట్​ ఫీలో కన్సెషన్​ ఉంటుందని ఎల్​ఐసీ పేర్కొంది. తమకు రావాల్సిన ప్రీమియం రూ. లక్ష దాకా ఉంటే దానిపై లేట్​ఫీలో 20 శాతం దాకా (మాగ్జిమం రూ. 2 వేలు) కన్సెషన్​ ఉంటుందని వివరించింది. ఇక మైక్రో ఇన్సూరెన్స్​ ప్లాన్లపై లేట్​ ఫీకి పూర్తి కన్సెషన్​ ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ క్యాంపెయిన్‌‌‌‌‌‌‌‌లో భాగంగా ప్రీమియం చెల్లించడం మానేసి అయిదేళ్ల లోపయిన ఎలిజిబుల్​ పాలసీలను రివైవ్​ చేసుకోవచ్చని, ఇందుకు కొన్ని టర్మ్స్​ అండ్​ కండిషన్లు ఉన్నాయని ఎల్​ఐసీ ఈ స్టేట్​మెంట్లో వివరించింది.